వెంకన్న సాక్షిగా హామీల అమలేది?: బాబుపై విష్ణుకుమార్ రాజు, అడ్డుకున్న టీడీపీ

హోంగార్డుల జీతాలు పెంచాలని, వారిని పర్మినెంట్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. హోంగార్డుల జీతాలు పెంచూతు మంగళవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అమరావతి: హోంగార్డుల జీతాలు పెంచాలని, వారిని పర్మినెంట్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. హోంగార్డుల జీతాలు పెంచూతు మంగళవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రూ.300(రోజుకు)ల నుంచి రూ.400లకు వేతనానలు పెంచుతున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది.

వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు..

వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు..

కాగా, ఎన్నికల సమయంలో హోంగార్డులను క్రమబద్దీకరిస్తామని చంద్రబాబునాయుడు తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారని విష్ణుకుమార్ రాజు గుర్తుచేశారు. రూ.400లకు వేతనం పెంచడం వల్ల హోంగార్డులకు ఎలాంటి లాభం ఉండదని అన్నారు. మిగితా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో జీతాలు తక్కువేనని అన్నారు.

సుప్రీం ఆదేశాలు పట్టించుకోరా..

సుప్రీం ఆదేశాలు పట్టించుకోరా..

అంతేగాక, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.672 చెల్లించాలని అన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. హోంగార్డు జీతాలను రోజుకు రూ. 660 పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఇప్పుడున్న జీతాలు వారి ఫ్యామిలీ పోషణ, విద్యార్థుల చదువులకు కూడా సరిపోవని అన్నారు.

మోడీని ప్రస్తావిస్తూ అడ్డుతగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు

మోడీని ప్రస్తావిస్తూ అడ్డుతగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు

ఇది ఇలావుంటే.. అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, హోదా ఇస్తామని తిరుపతిలో ప్రధాని మోడీ కూడా హామీ ఇచ్చారని అన్నారు. చర్చ జరిగే అంశాన్ని తప్పుదోబపట్టించే యత్నాలు చేయొద్దని, ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని విష్ణుకుమార్ రాజు అన్నారు. హోంగార్డుల జీతాలు పెంపు, పర్మినెంట్ చేస్తామని టీడీపీ తమ మేనిఫెస్టోలో కూడా పెట్టిందని గుర్తు చేశారు.

పరిస్థితి బాగోలేనందునే..

పరిస్థితి బాగోలేనందునే..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందున హోంగార్డుల వేతనాలను సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పెంచలేకపోతున్నామని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. రూ.400కంటే ఎక్కువగా పెంచడం అసాధ్యమని ఆయన అన్నారు. విధి నిర్వహణలో మరణిస్తే రూ.5లక్షల పరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో హోంగార్డులకు 5ఏళ్ల వయోపరిమితి సండలింపు ఉంటుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+