పవన్! అలా చేస్తే.. సమైక్యాంధ్ర కోసం మాట్లాడినట్లే: విష్ణుకుమార్ రాజు సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ఉద్యమం చేస్తాననడం అర్ధరహితమని అన్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ఉద్యమం చేస్తాననడం అర్ధరహితమని అన్నారు.
విష్ణుకుమార్ రాజు శుక్రవారం మాట్లాడుతూ.. ఇప్పుడు హోదా కోసం పోరాటం అంటే.. సమైక్యాంధ్ర కోసం మాట్లాడినట్లేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, ఉద్యమాల పేరుతో ప్రజా సమయాన్ని వృధా చేయొద్దని పవన్ కళ్యాన్'కు విష్ణుకుమార్ రాజు హితవు పలికారు.

కాగా, ఇటీవల ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం మాట్లాడిన తెలంగాణ ఎంపీలు, వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీలను పవన్ కళ్యాణ్ అభినందించారు కూడా. తెలుగుదేశం ఎంపీలు మాత్రం హోదా కోసం ఎలాంటి పోరాటం చేయడం లేదని ఆరోపించారు. ఏపీకి కేంద్రం హోదా ఇవ్వాల్సిందేనని పవన్ అన్నారు.












Click it and Unblock the Notifications