వైఎస్ వివేకా హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ .. తెరమీదకు కొత్త వ్యక్తి సుబ్బారాయుడు .. సునీత ఫిర్యాదు
తెలుగు రాష్ట్రాలలో ప్రభంజనం సృష్టించిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులు ఎవరు అన్నది తేల్చటం సిబిఐ అధికారులకు కూడా పెద్ద సమస్యగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ హత్య కేసులో మరో కొత్త పేరు సంచలనంగా మారింది. సుబ్బారాయుడు అనే వ్యక్తి ఈ హత్య కేసు గురించి సెంట్రల్ గ్రీవెన్స్ సెల్ కు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అసలు ఈ కొత్త వ్యక్తి ఎవరు అన్న చర్చ కడప లో హాట్ టాపిక్ గా మారింది.

వివేకా హత్య కేసు వివరాలు కావాలని గ్రీవెన్స్ ను కోరిన సుబ్బారాయుడు
ఇంతకీ ఏం జరిగిందంటే వివేకా హత్య కేసు కు సంబంధించిన వివరాలు కావాలని సుబ్బారాయుడు అనే వ్యక్తి గ్రీవెన్స్ సెల్ కు విజ్ఞప్తి చేశారు. అలాగే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ను కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఒక లేఖ రాశారు. ఇక ఈ విషయం సునీత సెల్ కు మెయిల్ వెళ్లడంతో సీరియస్ అయిన సునీత సుబ్బారాయుడు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసలీ సుబ్బారాయుడు ఎవరు ? వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు ఏం సంబంధం ? అన్న కోణంలో దర్యాప్తు చేయాలని ఆమె కోరుతున్నారు.

సుబ్బారాయుడిపై సునీత ఫిర్యాదు
ఈ కేసును తప్పుదారి పట్టించాలని కావాలని కుట్రపూరితంగా తనపై విచారణ జరపాలని అతను ప్రభుత్వానికి లేఖ రాశాడని వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పులివెందుల డిఎస్పి కి సుబ్బారాయుడుపై ఫిర్యాదు చేశారు. సుబ్బరాయుడు అనే వ్యక్తి కడపకు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది . అయితే అతనికి వివేకా హత్య కేసులో ఏంటి సంబంధం అన్నది మాత్రం అంతుచిక్కకుండా ఉంది. ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసులో అనేక మలుపులు చోటు చేసుకోగా, తాజాగా సుబ్బారాయుడు వ్యవహారం కడపలో దుమారం గా మారింది. ఈ కేసులో కొత్త కొత్త పేర్లు తెరమీదకు రావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Recommended Video

వైఎస్ వివేకా కేసులో రోజుకో కొత్త మలుపు .. ఊహించని పేర్లు
2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత అత్యంత దారుణంగా వైయస్ వివేకానంద రెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు ఈ కేసు విషయంలో హంతకులు ఎవరు? ఎందుకు వైయస్ వివేకానంద హత్య చేశారు? దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేదా మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న అంశాలు కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం సీబీఐ అధికారులు ఈ కేసును శరవేగంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితులను మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి రావడం, ఊహించని ట్విస్టులు చోటుచేసుకోవడం ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్న అనుమానాలకు కారణం అవుతుంది.












Click it and Unblock the Notifications