విశాఖలో ఏడేళ్ల బాలిక కిడ్నాప్, దారుణ హత్య: మేనమామపై అనుమానం
విశాఖ: ఏపీలోని విశాఖ జిల్లా దేవరాపల్లిలో మంగళవారం అదృశ్యమైన చిన్నారి దివ్య (7) దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని దేవరాపల్లి శివారి క్వారీలో గురువారం స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. ఈ నెల 22వ తేదీన చిన్నారి దివ్య పాఠశాల నుంచి ఇంటికి వస్తూ అదృశ్యమైంది.

బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బాలిక మేనమామ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications