వైజాగ్ రాజధాని - వాళ్లూ వీళ్లూ గుర్తించడమేనా-హైకోర్టు తేల్చేదెప్పుడు ?
ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా తెరపైకి వచ్చిన విశాఖ రాజధాని ఇప్పుడు గుర్తింపుకు మాత్రం నోచుకోవడం లేదు. రాజధాని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని ఎలా సమర్ధించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటే, కోర్టుల్లో పెండింగ్ సమస్యలు, కేంద్ర ప్రభుత్వ మౌనం దానికి తోడయ్యాయి. దీంతో ఇప్పుడు వైజాగ్ రాజధానిగా స్ధానికులు కూడా చెప్పుకోలేని పరిస్ధితి. తాజాగా తూర్పు నౌకాదళాధిపతి సీఎం జగన్ ను కలిసి మన కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం పేరుతో దీని పేరుతో ముంబైలో ఓ యుద్ధనౌక ప్రారంభిస్తున్నట్లు చెప్పడం చర్చనీయాంశమవుతోంది.

వైజాగ్ రాజధాని కథ
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా తెరపైకి వచ్చిన విశాఖ రాజధానిని అసెంబ్లీ, గవర్నర్ గుర్తించినా హైకోర్టు గుర్తించకపోవడంతో న్యాయవివాదాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. వైజాగ్ లో రాజధాని ఏ క్షణాన్నైనా ఏర్పాటవుతుందని మున్సిపల్ మంత్రి బొత్స మినహా మిగిలిన వారు రాష్ట్రంలో ప్రస్తావించడం కూడా మానేశారు. ఎందుకంత అపనమ్మకం ఏర్పడిందని పరిశీలిస్తే మూడు రాజధానులపై హైకోర్టులో దాఖలైన వాజ్యాలపై విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్ధితి. ఒకవేళ హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చినా ఆ తర్వాత మళ్లీ అప్పీళ్లు దాఖలు కావడం ఖాయం. అంతటితో కథ పూర్తవుతుందా అంటే అదీ ఖాయం కాదు. సుప్రీంకోర్టుకు ఎలాగైనా ఈ వివాదం చేరక తప్పేలా లేదు. దీంతో వైజాగ్ రాజధాని కథ అంతులేని వ్యధగా మారిపోతోంది.

వైజాగ్ రాజధాని వ్యధ
వైజాగ్ లో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తామంటూ వైసీపీ సర్కార్ ఘనంగా ప్రకటించుకుంది. అంటే అసలు రాజధాని ఇక్కడే అని చెప్పేసింది. ఈ లెక్కన చూస్తే వందల సంఖ్యలో వాణిజ్య సముదాయాలు, కొత్త కంపెనీలు, కార్పోరేట్ వ్యక్తులు వైజాగ్ పై వాలిపోవాలి. నిత్యం వరుసగా ప్రభుత్వం వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటూ బిజీగా కనిపించాలి. కానీ రాజధాని ప్రకటన తర్వాత అలాంటివేవీ అక్కడ కనిపించడం లేదు. అలాగని రాష్ట్ర ప్రభుత్వమో లేక కేంద్ర ప్రభుత్వమో కొత్త సంస్ధల్ని, భారీ ఎత్తున అభివృద్ధి పనుల్ని ప్రకటించారా అంటే అదీ కానరావడం లేదు. చివరికి అభివృద్ధి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోయే రియల్ ఎస్టేట్ రంగం హడావిడి అయినా కనిపిస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో రాజధాని ప్రకటన మినహా వైజాగ్ కు ఒరిగిందేమీ లేదన్న చర్చ సామాన్యుల్లో జరుగుతోంది.

గుర్తింపే అసలు సమస్య
ఓసారి వైజాగ్ ను ఏపీ రాజధానిగా గుర్తిస్తే మిగతా సమస్యలన్నీ వాటంతట అవే సర్దుకుపోతాయి. కానీ ఇది ఎవరు చేయాలి. కేంద్ర ప్రభుత్వమో, హైకోర్టో తమ నిర్ణయం ప్రకటించాలి. కానీ కేంద్రం రాజధానులు రాష్ట్రప్రభుత్వ ఇష్టమని ఓసారి, బీజేపీ మూడు రాజధానులతో డబ్బులు వృథా కావడాన్ని వ్యతిరేకిస్తుందని మరోసారి పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతో గందరగోళం సృష్టిస్తోంది. అటు హైకోర్టులో రాజధానులపై విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్ధితి. దీంతో హైకోర్టులో రాజధానుల విచారణ జరిగి వైజాగ్ ను రాజధానిగా గుర్తిస్తారన్న నమ్మకం స్ధానికుల్లో సడలిపోతోంది. మరి ఈ నమ్మకం నిలబెట్టాల్సిన బాథ్యత కలిగిన వైసీపీ సర్కార్ ఎందుకు మౌనంగా ఉండిపోతోందనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

రాజధాని గుర్తింపు పేరుతో ఆటలు
వైజాగ్ రాజధాని గుర్తింపు వ్యవహారం ఇంత జటిలం కావడానికి ప్రధాన కారణం కేంద్రమే. గతంలో రెండు, మూడు సందర్భాల్లో ప్రజల నాడి తెలుసుకోవడానికా అన్నట్లు.. తమ అధికారిక పత్రాల్లో వైజాగ్ ను రాజధానిగా పెట్టి, ఆ తర్వాత వ్యతిరేకత వచ్చేసరికి అబ్బే అదేం లేదంటూ కేంద్రం బుకాయించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా భారత నౌకాదళం కూడా వైజాగ్ కార్యనిర్వాహక రాజధాని కాబట్టి ఈ పేరుతో యుద్ధనౌక విశాఖపట్నాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ కు సమాచారం ఇచ్చింది. దీంతో అసలు వైజాగ్ రాజధానికి కేంద్రం గుర్తింపు ఇచ్చినట్లా లేదా అనే చర్చ సాగుతోంది. ఈ మేరకు ప్రజల్లో గందరగోళం కూడా పెరుగుతోంది.

హైకోర్టు గుర్తిస్తేనే వైజాగ్ రాజధాని
ప్రస్తుత పరిస్దితుల్లో హైకోర్టులో మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన వందకు పైగా పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై హైకోర్టు సమగ్రంగా విచారణ చేపట్టాల్సి ఉంది. ఇందులో వందలాది వ్యక్తులు, ప్రభుత్వ విభాగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అధికారగణం, అమరావతిలో భూములిచ్చిన రైతులు, స్ధానికులు ఇలా ఎంతో మంది అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొదలై పూర్తి కావాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం తప్పదు. కానీ హైకోర్టులో ఛీఫ్ జస్టిస్ ల మార్పులతో రాజధానుల విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఇది పూర్తయితే కానీ వైజాగ్ రాజధానికి గుర్తింపు లభిస్తుందా లేదా అన్నది లేలదు. అప్పటివరకూ హైకోర్టు వైపు ఎదురుచూపులు తప్పేలా లేవు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications