మోడీ టూర్ వేళ విశాఖ ఉద్రిక్తం-వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆందోళనలు మళ్లీ మొదలు..

ప్రధాని మోడీ ఎల్లుండి విశాఖ రాబోతున్నారు. కీలక ప్రాజెక్టులతో పాటు స్ధానికంగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సీఎం జగన్ తో కలిసి శంఖుస్ధాపన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్న స్టీల్ ప్లాంట్ వ్యవహారం కూడా చేరింది. ప్రధాని టూర్ వేళ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు కార్మికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు తప్పడంలేదు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇవాళ మరోసారి కార్మికులు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు ఏడాదిన్నరగా ఉద్యమాలు చేస్తున్న కార్మికులు ఇవాళ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బైక్ లను పక్కనబెట్టి నడుచుకుంటూనే ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు కూడా అడ్డుచెప్పే పరిస్దితి లేకపోయింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము ఉద్యమాలు చేస్తుంటే అధికార, విపక్ష పార్టీలు తమకు సహకరించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

vizag steel protests resumed today ahead of pm modis tour on nov 11 and 12

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్రధానిని కోరుతూ కార్మికులు ఇవాళ బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రధాని మోడీ విశాఖ టూర్ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కార్మికులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ దిశగా తమకు సహకరించాలని కార్మికులు కోరుతున్నారు. ఇప్పటికే సీపీఐ నేతలు ప్రధాని టూర్ వేళ ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. దీంతో ప్రధాని టూర్ ఎలా జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ఇది అధికారిక పర్యటన మాత్రమేనని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దూరంగా ఉన్న విపక్షాలు కార్మికుల పక్షాన నిరసనల్లో పాల్గొంటాయా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+