యుద్దం మొదలైంది..! జగన్ మీడియాపై నిప్పులు చెరిగిన లోకేష్..!!
అమరావతి/హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ మీడియా సంస్థలు తనపై కక్ష కట్టాయనే విషయం మరోసారి రుజువైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవాలయం లాంటి టీడీపీలో చిచ్చు పెట్టాలనే కుట్రలో భాగంగా సాక్షి ఛానల్ అవాస్తవాలు, అభూత కల్పనలను ప్రసారం చేస్తోందని ఆరోపించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తాను మంగళగిరి ఎన్‌ఎస్‌ఎస్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నానని.. అయితే గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడినట్లు పేర్కొంటూ నా వ్యాఖ్యలను వక్రీకరించి అవాస్తవ ప్రచారాన్ని సాక్షి ఛానల్‌లో బ్రేకింగ్ న్యూస్‌గా వేశారని ఆరోపించారు.రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో ఓ మహిళా కార్యకర్త మాట్లాడిన మాటలను తనకు ఆపాదించి తెదేపా నేతలు, కార్యకర్తలపై లోకేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రసారం చేయడంలో జగన్ మీడియా ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

తమ పాలిట కార్యకర్తలే దేవుళ్లని.. వారిని పార్టీ నుంచి దూరం చేయాలనే కుట్రతోనే సాక్షి ఇలాంటి ప్రసారాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే తెదేపా బలమని.. జగన్ మీడియా ఎన్ని కుట్రలు చేసినా వారిని పార్టీ నుంచి దూరం చేయలేరని లోకేశ్ ట్విటర్‌లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications