వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం కాంట్రాక్టర్ మార్పుపై గడ్కరీ మెలిక: పనుల పురోగతి లేకపోతే చర్యలు,

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హమీ ఇచ్చారు. నెల రోజుల్లో పోవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని చూపాలని పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు గడ్కరీ ఆదేశించారు.

Recommended Video

‘పోలవరం’ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తా | Oneindia Telugu

పోలవరం: నేడు గడ్కరీతో బాబు కీలక భేటీ, 'ఆ ట్విస్ట్‌కు కేంద్రానిదే బాధ్యత'పోలవరం: నేడు గడ్కరీతో బాబు కీలక భేటీ, 'ఆ ట్విస్ట్‌కు కేంద్రానిదే బాధ్యత'

అదే జరిగితే కాంట్రాక్టర్ మార్పు అంశం తెరమీదికి వచ్చింది. పనుల పురోగతి ఆధారంగా కేంద్రం కాంట్రాక్టర్ మార్పు విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

జగన్‌కు షాక్: పోలవరంపై బిజెపి, టిడిపిల ఏకాభిప్రాయం, వైసీపీకి బాబు చెక్జగన్‌కు షాక్: పోలవరంపై బిజెపి, టిడిపిల ఏకాభిప్రాయం, వైసీపీకి బాబు చెక్

పోలవరం ప్రాజెక్టు విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుదవారం రాత్రి న్యూఢిల్లీలో కేంద్ర జలనవరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేసే విషయమై చర్చించారు.

2018 నాటికి పోలవరం పూర్తికి సహకరిస్తాం

2018 నాటికి పోలవరం పూర్తికి సహకరిస్తాం

2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ రాష్ట్రానికి హమీ ఇచ్చారు.పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏ రకంగా పట్టుదలతో ఉన్నారో తాను కూడ అదే రకమైన పట్టుదలతో ఉన్నానని నితిన్ గడ్కరీ చెప్పారు.

పోలవరం కాంట్రాక్టర్‌కు నెలరోజుల టైమ్

పోలవరం కాంట్రాక్టర్‌కు నెలరోజుల టైమ్

నెలరోజుల్లో పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని చూపాలని కాంట్రాక్టర్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి చూపకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు నితిన్ గడ్కరీ. రోజుకు సుమారు 7 వేల క్యూబిక్ మీటర్ల కాంట్రాక్టు పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు నితిన్ గడ్కరీ

పోలవరానికి పూర్తి టైమ్ సీఈఓ

పోలవరానికి పూర్తి టైమ్ సీఈఓ

పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సమయం సీఈఓను నియమించనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.95 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. పునరావాసం కల్పించేందుకు కూడ అవసరమైన చర్యలు తీసుకొంటామని గడ్కరీ చంద్రబాబుకు హమీ ఇచ్చారు

కాంట్రాక్టర్ మార్పుకు మార్గం సుగమమేనా

కాంట్రాక్టర్ మార్పుకు మార్గం సుగమమేనా

కాంట్రాక్టర్ మార్పుకు సానుకూలంగా కేంద్రం సంకేతాలు ఇచ్చినట్టు కన్పిస్తోంది. నెలరోజుల్లో కేంద్ర మంత్రి ఆదేశాలకు అనుగుణంగా కాంట్రాక్టర్ ప్రాజెక్టు పనులు చేయకపోతే కాంట్రాక్టర్‌ను మారుస్తారా, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొంటారా అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని గడ్కరీ తేల్చిచెప్పారు. అయితే నెలరోజుల సమయంలో ప్రతి రోజూ ఏ మేరకు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష ఆధారంగా కాంట్రాక్టర్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

English summary
Ap chief minister met union minister Nitin Gadkari over Polavaram project on Wednes day at Delhi.NItin Gadkari said that one month time to contractor to compelete concrete works.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X