వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జనసేన చీఫ్‌తో చర్చలు': పవన్ అనుమానాలేంటి, ఇలాంటి వారు.. పురంధేశ్వరి

రానున్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేస్తామని సిపీఐ ఏపీ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యల పైన పోరాడేందుకు ఆయనతో చేతులు కలిపేందుకు సిద్ధమని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రానున్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేస్తామని సిపీఐ ఏపీ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యల పైన పోరాడేందుకు ఆయనతో చేతులు కలిపేందుకు సిద్ధమని చెప్పారు.

<strong>హోదా ఆగిపోతుంది: పురంధేశ్వరి, 'పవన్ కళ్యాణ్ మిత్రుడే కానీ.. తెలియక'</strong>హోదా ఆగిపోతుంది: పురంధేశ్వరి, 'పవన్ కళ్యాణ్ మిత్రుడే కానీ.. తెలియక'

పవన్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమని సీపీఐ ఒకటికి రెండుసార్లు చెబుతోంది. ఇప్పుడు ఆయన మరోసారి స్పష్టం చేశారు.ప్ర‌జాచైత‌న్య యాత్ర‌లో భాగంగా ఆదివారం రాత్రి విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాలోని న‌ర్సీపట్నం చేరుకున్న ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు.

రానున్న రోజుల్లో ప‌వ‌న్‌తో చేతులు క‌లుపుతామ‌న్నారు. కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జా సంక్షేమాన్ని గాలికొదిలేశాయ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిల‌దీసే ద‌మ్ము ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు లేద‌న్నారు. ప‌వ‌న్‌తో ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిపామ‌ని, భ‌విష్య‌త్తులో ఆయ‌నతో క‌లిసి ఉద్య‌మిస్తామ‌న్నారు.

pawan kalyan

పవన్ కళ్యాణ్ అనుమానాలేంటి: పురంధేశ్వరి

ప్రత్యేక హోదా విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఉన్న అనుమానాలను ఏమిటో చెప్పాలని, తాము వాటిని నివృత్తి చేస్తామని బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి చెప్పారు. పవన్‌కు తనకు ఉన్న అనుమానాలు చెప్పాలన్నారు.

ఏపీ అభివృద్ధికి సహకరించేలా నిధులు ఇచ్చేందుకు కేంద్రంలోని ప్రధాని మోడీ సర్కారు సిద్ధంగా ఉందని, ఇప్పటికే ఎన్నో నిధులను ఇచ్చామని, విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. హోదా ఇవ్వలేక అందుకు సమానమైన ప్యాకేజీని కేంద్రం అందిస్తోందన్నారు. పవన్ వంటి వ్యక్తులు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడరాదన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిని సారించి సలహాలు, సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

English summary
CPI Ramakrishna on Sunday said that they are ready to work with Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X