''కాకినాడ ఫలితంతోనే జగన్ పార్టీలో ముసలం''

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:పార్టీ నుండి 22 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళినా కానీ, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆత్మపరిశీలన చేసుకోలేదని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చెప్పారు.అ
సెంబ్లీ సమావేశాలకు హజరుకావాలని చాలా మంది ఎమ్మెల్యేలకు ఉన్నా జగన్ మాటకు ఎదురు చెప్పలేకపోయారని ఆమె అన్నారు. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలతో వైసీపీలో అంతర్మధనం మొదలైందని గిడ్డి ఈశ్వరీ అభిప్రాయపడ్డారు.

వైసీపీ కీలక నేతతో టచ్‌లో: బాంబు పేల్చిన మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి ప్లాన్ ఇదే

వైసీపీ నుండి పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ టిడిపిలో చేరారు. వైసీపీలో జగన్‌కు మద్దతిచ్చే గిడ్డి ఈశ్వరీ టిడిపిలో చేరడం అనుహ్యపరిణామంగానే వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీ కీలక నేతతో టచ్‌లో: బాంబు పేల్చిన మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి ప్లాన్ ఇదే

అయితే వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ లాంటి నేత గిడ్డి ఈశ్వరీ పార్టీని వీడరనే కుండబద్దలు కొట్టారు. కానీ, గిడ్డి ఈశ్వరీ పార్టీని వీడారు. అయితే కుంబా రవిబాబును పార్టీలోకి తీసుకోవాలనే నిర్ణయం కారణంగానే గిడ్డి ఈశ్వరీ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెబుతున్నారు. ఓ తెలుగు న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు.

రవిబాబు ఎఫెక్ట్: అనుచరులతో గిడ్డి ఈశ్వరీ సమావేశం, జగన్‌కు షాకిచ్చేనా?

బాబుపై ఆసక్తికరం: అద్దం ముందు నిలబడి స్పీచ్ ప్రాక్టీస్, అసెంబ్లీకి హజరైన గిడ్డి ఈశ్వరీ

కాకినాడ ఫలితాలతోనే వైసీపీలో గుబులు

కాకినాడ ఫలితాలతోనే వైసీపీలో గుబులు

నంద్యాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతల్లో అంతగా ఇబ్బంది పెట్టలేదని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ అభిప్రాయపడ్డారు. నంద్యాల అసెంబ్లీ ఉఫ ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతల్లో తీవ్ర ప్రభావాన్ని చూపాయని ఆమె చెప్పారు. కాకినాడ ఫలితం తర్వాత మాత్రం అందరిలో ఆందోళన మొదలైంది. కాపు ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో వైసీపీ విజయం ఏకపక్షం అనుకుంటే ఆ ఎన్నికలలో టీడీపీ సాధించిన ఘన విజయంతో మాలో అంతర్మథనం మొదలైందని ఆమె చెప్పారు.

అభిప్రాయాలు చెప్పాలని కోరి జగన్ అమలు చేయరు

అభిప్రాయాలు చెప్పాలని కోరి జగన్ అమలు చేయరు

పార్టీలో పలు విషయాలపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తమ అభిప్రాయాలను తీసుకొంటారని, కానీ, వాటిని అమలు చేయరని గిడ్డి ఈశ్వరీ చెప్పారు. కీలక నిర్ణయాలన్నీ జగన్ తీసుకుంటారని ఆమె కుండబద్దలు కొట్టారు.అభిప్రాయాలు చెప్పమంటారని, కానీ, చెప్పిన అభిప్రాయాలను పట్టించుకోరని ఆమె చెప్పారు. అలాంటి సమయంలో అభిప్రాయాలు తీసుకొని అమలు చేయకపోవడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ఆమె ప్రశ్నించారు.

అసెంబ్లీకి హజరుకావాలని ఉండేది

అసెంబ్లీకి హజరుకావాలని ఉండేది

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే నిర్ణయం పట్ల చాలా మంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉందని గిడ్డి ఈశ్వరీ చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకవాలని చాలా మంది ఎమ్మెల్యేలు అభిప్రాయంతో ఉన్నారని ఆమె చెప్పారు.అయితే ఇద్దరు ముగ్గురు మాత్రమే అసెంబ్లీకి వెళ్దామని చెప్పాం. జగన్‌ లేకుండా సభలో మాకు మైకులిస్తారన్న నమ్మకం లేదు. అందుకే తొలిరోజు అసెంబ్లీకి వెళ్లి ధర్నా చేసి వద్దామని రోజా సహా మేమంతా అనుకున్నాం. అయితే, ఆయన ఒక తీర్మానం చేసిన తర్వాత ఇంకేమీ మాట్లాడలేకపోయాం. పార్టీ సమావేశాలలో అసలు చర్చలంటూ ఏం జరగవని గిడ్డి ఈశ్వరీ చెప్పారు.

భారతి ఫోన్ చేస్తే మాట్లాడలేదు

భారతి ఫోన్ చేస్తే మాట్లాడలేదు

వైఎస్ భారతి తనకు ఫోన్ చేశారని ఆ సమయంలో తాను భారతితో మాట్లాడలేదని గిడ్డి ఈశ్వరీ చెప్పారు. కానీ, ఆ తర్వాత తాను గిడ్డి ఈశ్వరీకి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ తీయలేదని ఈశ్వరీ చెప్పారు. జగన్‌ కూడా మాట్లాడలేదని చెప్పారు. పార్టీ మారాలనే నిర్ణయం మేరకు అనివార్యపరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందని గిడ్డి ఈశ్వరీ చెప్పారు.

రోజాతో సన్నిహితంగా ఉండేదాణ్ణి

రోజాతో సన్నిహితంగా ఉండేదాణ్ణి

రోజాతో తాను చాలా సన్నిహితంగా ఉండేదాణ్ణని గిడ్డి ఈశ్వరీ చెప్పారు. ప్రతి రోజూ రోజా నేను ఫోన్‌లో మాట్లాడుకొనే వాళ్ళమని ఈశ్వరి గుర్తు చేశారు. అయితే పార్టీ మారిన తర్వాత రోజా తనపై విమర్శలు గుప్పిస్తోందన్నారు. రోజా కనీసం ఫోన్‌ చేసి కూడా పలకరించలేదు. పైగా ఇప్పుడు రోజా కూడా టీచర్‌ను జగన్‌ ఎమ్మెల్యే చేశారంటూ మాట్లాడుతున్నారు. అది బాధనిపిస్తోంది. నేను రోజా అంత సెలబ్రిటీ కాకపోయినా.. మా ప్రాంతంలో నాకంటూ గుర్తింపు ఉంది. అలాగే ఆమెను నేను ఒక సోదరిగానే భావించాను. అలాంటిది ఆమె కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారుని గిడ్డి ఈశ్వరీ చెప్పారు.

నేనే టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నా

నేనే టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నా

స్థానికంగా నెలకొన్న పరిస్థితుల మేరకు పార్టీ మారాలనే నిర్ణయం తీసుకొన్నానని గిడ్డి ఈశ్వరీ చెప్పారు. తనతో టిడిపి నేతలు ఎవరూ కూడ సంప్రదించలేదని చెప్పారు.నెల రోజుల పాటు తీవ్రంగా మధనపడిన తర్వాత నా అంతట నేను తీసుకున్న నిర్ణయం. టీడీపీ నుంచి నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేనే స్వయంగా ఆ పార్టీ వారిని కలిసి నా ఆసక్తిని చెప్పాను. టీడీపీ వాళ్లు నాకు పైసా కూడా ఆఫర్‌ చేయలేదని గిడ్డి ఈశ్వరీ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Paderu MLA Giddi Eswari said that after Kakinada result ysrcp leaders realized what is the ysrcp situation in state. Telugu channel interviewed Giddi Eswari on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి