బంగాళాఖాతంలో వాయుగుండం: ఏపీలో ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ

Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ జిల్లాల వరకూ భారీ వర్షాలు దంచికొట్టాయి. ప్రత్యేకించి- రాయలసీమలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల తీవ్రత మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. ఇది- వచ్చే 24 గంటల్లో పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది. క్రమంగా తీరం వైపు కదిలి.. గురువారం సాయంత్రానికి ఒడిశా దక్షిణ ప్రాంత-ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Weather Alert Heavy Rainfall Expected Across Andhra Pradesh Due to Cyclonic Circulation

ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వాయుగుండం తీరానికి సమీపించినప్పుడు- ఆ తర్వాత 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు.

ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

  • మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి 50.30 అడుగుల నీటిమట్టానికి చేరింది.
  • ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 11,03,802 క్యూసెక్కులు నమోదైంది. ఇక్కడ మొదటి హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని, దాదాపు 12- 12.5 లక్షల క్యూసెక్కుల వరకు చేరుతుందని ఎస్డీఎంఏ అంచనా వేసింది.
  • కృష్ణా నదికీ వరద తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో- ఔట్ ఫ్లో 6,69,188 క్యూసెక్కులుగా రికార్డయింది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇనన్ ఫ్లో ఏడు లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+