Weather: ఏపీలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో విస్తారంగా, ఉరుములుమెరుపులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పట్లో వర్షాలు తగ్గేట్లు కనిపించడం లేదు. ఇప్పటికే గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రాగల మూడు రోజులు ఏపీలో వర్షాలు

రాగల మూడు రోజులు ఏపీలో వర్షాలు


వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రుతుపవన ద్రోణి పోరుబందర్, సూరత్, జల్గావ్, రామగుండం, మచిలీపట్నంల మీదుగా ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది. ఒక ఉపరితల ద్రోణి దక్షిణ గుజరాత్ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఏర్పడింది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ పేర్కొంది.

ఉత్తరకోస్తాలో.. పలు జిల్లాల్లో వర్షాలు

ఉత్తరకోస్తాలో.. పలు జిల్లాల్లో వర్షాలు


బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షణి కోస్తాలోని ఈ జిల్లాల్లో అత్యధిక వర్షాలు

దక్షణి కోస్తాలోని ఈ జిల్లాల్లో అత్యధిక వర్షాలు

దక్షిణ కోస్తా ఆంధ్రాలో బుధవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలోనూ మూడు రోజుల వర్షాలు

రాయలసీమలోనూ మూడు రోజుల వర్షాలు

రాయలసీమలో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, కడప జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురువారం రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీతోపాటు తెలంగాణలో కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. ఫ్లైఓవర్లపైనుంచి వరద నీరు కింద నుంచి వెళ్లే వాహనాలపై పడుతోంది. ఈ దృశ్యానలు వాటర్ ఫాల్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియలో వైరల్ చేస్తున్నారు. వెకేషన్ కోసం ఎక్కడికి వెళ్లే పనిలేదని, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నగరంలోనే ఏర్పాటు చేశారంటూ సెటైర్లు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+