ఆల్కహాల్ మానేద్దామనుకుంటున్నారా ఏంటి?
మద్యపానం ఆరోగ్యానికి హానికరమనే విషయం అందరికీ తెలిసిందే. బాగా అలవాటు ఉన్నవారు దీన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే శరీరం నుంచి వచ్చే సూచనలను అర్థం చేసుకొని మాత్రమే దీన్ని మానేయాలని నిపుణులు తెలియజేస్తున్నారు. లేదంటే అనారోగ్యాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. మందు మానేయాలనే ఆలోచన చాలా మంచిదే. దీర్ఘకాలంలో దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మద్యపానానికి దూరంగా ఉంటే ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.
అకస్మాత్తుగా మద్యం మానేస్తే తేలికపాటి ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, వణుకు, మూర్ఛ, మతిమరుపు లాంటి సమస్యలు ఎదురవుతాయి. తీసుకునే ఆల్కహాల్ శాతాన్ని బట్టి ఇవి ఎదురవుతుంటాయి. కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఉంటాయి. మద్యం శరీరాన్ని డీ హైడ్రేట్ చేస్తుంది. మానేసిన వెంటనే శరీరం హైడ్రేట్ అవుతుంది. ఎక్కువ శక్తిని ఇవ్వడంతోపాటు అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. చర్మం మెరుగ్గా కనపడుతుంది.

ఆల్కహాల్ తాగినప్పుడు ఎక్కువగా నిద్రపోయినా అది నిద్ర నాణ్యతను దిగజారుస్తుంది. మద్యం మానేసినప్పుడే మంచి నిద్ర పడుతుంది. దీనివల్ల విశ్రాంతి పెరుగుతుంది. టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. బరువు కూడా సులువుగా తగ్గొచ్చు. ఎక్కువగా మద్యం సేవిస్తే కాలేయం దెబ్బతింటుంది. మానేసినప్పుడు మాత్రం పనితీరు బాగుంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండటంతోపాటు స్ట్రోక్స్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. శరీరం బలంగా తయారవుతుంది. మానసికంగా మంచి అనుభూతిని పొందుతారు. ఆల్కహాల్ మానేయడం చాలామంది కష్టమనుకుంటారు. అందుకు ఆల్కహాలిక్ ఎనానిమస్ (Alcoholics Anonymous) వంటి గ్రూపుల నుంచి సహాయం తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications