పవన్ కళ్యాణ్ - చిరంజీవిలతో ముద్రగడ 'ఢీ'! జగన్ ప్లాన్ ఏమిటి?
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయమయ్యారు. గతంలో వెలుగు వెలిగిన ఆ నేత.. ఆ తర్వాత దాదాపు కనిపించకుండా పోయారు. ఇప్పుడు కాపు గర్జన పేరుతో మరోసారి తెరపైకి వచ్చారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలకు ఆయన కేంద్రబిందువు అయ్యారు.
ఇప్పుడు ఆయన వెంట ఎక్కువ మంది కాపులు నడిచేలా కనిపిస్తున్నారు. టిడిపి-బిజెపి మిత్రపక్షానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఉంది. తుని ఘటన పైన రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఆయన సీఎం చంద్రబాబును, పోలీసులను కూడా తప్పుబట్టారు. అయినప్పటికీ పవన్ వ్యాఖ్యలు ఒకింత చంద్రబాబుకు అండగా ఉన్నట్లు కనిపిస్తున్నాయనే వాదన వినిపించింది.
ఆ ఘటనలో ఇరువర్గాలను పవన్ కళ్యాణ్ తప్పుబట్టారని, ఆయన సరిగానే మాట్లాడారని మరికొందరు అంటున్నారు. అయితే, వైరి పక్షాలు మాత్రం చంద్రబాబుకు అండగా నిలబడినట్లుగా కనిపించిందని అంటున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి అండ ఉంది. మెగా సోదరులు కాపు వర్గానికి చెందిన వారు.

కాపులు ఎన్నో ఏళ్లుగా ఓటు బ్యాంకుగా ఉంటున్నారు తప్పు.. అధికారం మాత్రం వారికి అందడం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే ఎనిమిదేళ్ల క్రితం చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంకు కాపులు మద్దతు పలికారు. 2009లో చిరంజీవి అధికారంలోకి రాకపోయినప్పటికీ టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఓట్లు సంపాదించారు. ఆ ఓట్లకు చిరంజీవికి ఉన్న ఇమేజ్‌తో పాటు కాపు అంశం కూడా తోడైంది.
ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వేరే అంశం. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం చాలామంది కాపులు జీర్ణించుకోలేకపోయారని అంటుంటారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. టిడిపి - బిజెపిలకు పవన్ కళ్యాణ్ జోరుగా ప్రచారం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు కూడా కాపులను బీసీల్లో చేర్చుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇటీవలే కమిషన్ వేశారు.
నవ్యాంధ్రలో 27 శాతం కాపులు, అనుబంధ వర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి, టిడిపి - బిజెపిలకు పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసిపి అధినేత జగన్ కాపు నేత ముద్రగడ పద్మనాభంను తెరపైకి తీసుకు వచ్చారని అంటున్నారు.
కాపు సామాజిక వర్గాన్ని తన వైపు మళ్లించుకునేందుకు జగన్.. గతంలో దర్శకరత్న దాసరి నారాయణ రావును కూడా తన పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన దాసరిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. తాజాగా ముద్రగడకు మద్దతు పలుకుతున్నారు. తద్వారా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు ధీటుగా... కాపులను తన వైపుకు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications