స్నేహితుడితో మాట్లాడింది ఆ పై తనువు చాలించింది
ఒంగోలు :పోలీసులు వ్యవహారించిన తీరుతో మనస్థాపానికి గురైన ఓ విధ్యార్థిని ఆత్మహాత్య చేసుకొన్న ఘటన ఒంగోళు సంచలనం సృష్టించింది. స్నేహితుడితో మాట్టాడినందున ఆమెను పోలీసులు విచారించారు. పోలీసుల విచారణకు మనస్థాపానికి గురైన ఆమె ఉరివేసుకొని ఆత్మహాత్య చేసుకొంది.
ప్రకాశం జిల్లాలో ఇంజనీరింగ్ విధ్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. తాను ఉంటున్న కళాశాల హాస్టల్ లోనే ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఆమె ఆత్హహత్య చేసుకోవడానికి పోలీసులు విచారణ జరపడమే ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో నాగలక్ష్మి అనే ఇంజనీరింగ్ విద్యార్థిని సోమవారం సాయంత్రం తన స్నేహితుడితో మాట్లాడుతుండగా పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి మరీ ఆమెను విచారించారు. విషయం తెలుసుకొన్న కళాశాల యాజమాన్యం నాగలక్ష్మిని పోలీస్ స్టేషన్ నుండి తీసుకు వచ్చారు.
పోలీస్ స్టేషన్ నుండి హాస్టల్ కు చేరుకొన్న నాగలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురైంది. స్నేహితుడితో మాట్లాడినందుకే పోలీసులు తనను విచారించారనే భారతో హస్టల్ లోనే ఆమె ఉరివేసుకొని ఆత్మహాత్య చేసుకొంది. విధ్యార్థి బందువులు , కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications