• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అలందా మీడియా కు రవి ప్రకాష్ కు ఉన్న వివాదంలో విజయసాయి పాత్ర ఏంటో ?

|

విజయ్ సాయి రెడ్డి వర్సెస్ రవి ప్రకాష్ వీరిద్దరి మధ్య వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. రవిప్రకాష్ ఆస్తులపై ఈడీతో పాటు ఆయన చేసిన స్కామ్‌లపై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ నేపధ్యంలో రవి ప్రకాష్ విజయసాయి రెడ్డి పై మండిపడుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని చెబుతున్నారు. ఈ విషయాన్ని రవిప్రకాశ్ మేనేజర్ తెలిపారు.

రవి ప్రకాశ్ అరెస్టు వెనక అదే అసలు కారణమా..? కక్ష సాధింపు రాజకీయాలకు బలైనట్టేనా..?

విజయసాయి వర్సెస్ రవి ప్రకాష్ .. అసలు మ్యాటర్ ఏంటి ?

విజయసాయి వర్సెస్ రవి ప్రకాష్ .. అసలు మ్యాటర్ ఏంటి ?

అసలు రవి ప్రకాష్ కు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కి మధ్య ఉన్న వివాదం ఏమిటి ? గతంలో చంద్రబాబుకు సహకరించారన్న కోపమా.. లేకా మై హోం రామేశ్వర్ రావు, మేఘా కృష్ణా రెడ్డి తో ఉన్న స్నేహమా ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణం అవుతుంది. అసలు వివాదం అలందా మీడియాకి మరియు రవి ప్రకాష్ కు. కానీ విజయసాయిరెడ్డి ఎందుకు ఇంతగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారు. ఎందుకు ఇంతగా రవి ప్రకాష్ ను టార్గెట్ చేస్తున్నారు అనేది మాత్రం వారికే తెలియాలి.

విజయసాయిపై నోరు మెదపని రవి ప్రకాష్ .. నోరు పారేసుకుంటున్న విజయసాయి

విజయసాయిపై నోరు మెదపని రవి ప్రకాష్ .. నోరు పారేసుకుంటున్న విజయసాయి

ఇక సోషల్ మీడియా వేదికగా రవి ప్రకాష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం విజయ సాయికి పరిపాటే . కానీ ఇప్పటి వరకు రవి ప్రకాష్ విజయ సాయి విషయంలో ఏ మాత్రం స్పందించలేదు. ఇప్పుడు కావాలని రవిప్రకాశ్ పై అసత్య ఆరోపణలు చేసి, ఏకంగా లేఖ రాసి ఆయన పరువుకు భంగం కలిగించినందుకు దావా వేయబోతున్నట్టు రవి ప్రకాష్ ఆఫీసు మేనేజర్ వెల్లడించారు. టీవీ9లోకి మైహోం రామేశ్వరరావు, మేఘ కృష్ణారెడ్డి లు చట్ట వ్యతిరేకంగా ప్రవేశించారని, కావాలని తప్పుడు కేసులు బనాయించి రవి ప్రకాష్ ను ఇబ్బంది పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక వారికి వత్తాసు పలుకుతూ విజయ సాయి రవి ప్రకాష్ మీద లేఖలు రాస్తున్నారని మేనేజర్ చెప్పటం గమనార్హం .

విజయసాయికి రవి ప్రకాష్ మీద ఎందుకు ఇంత కక్ష

విజయసాయికి రవి ప్రకాష్ మీద ఎందుకు ఇంత కక్ష

విజయ్ సాయి రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో రవి ప్రకాష్ టార్గెట్ గా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే విజయ సాయి రాసిన లేఖ మేఘా కృష్ణా రెడ్డి అనుచరుడు రామారావు రాసిన లేఖ అని కావాలనే వారంతా కలిసి ఇలా చేస్తున్నారని అన్నారు రవి ప్రకాష్ మేనేజర్ . సీజేఐ కి రాసిన లేఖలో రవి ప్రకాష్ ఫెమా, ఆర్బీఐ రెగ్యులేషన్స్, మనీ లాండరింగ్‌లతో పాటూ ఇన్‌కమ్ టాక్స్ ఎగ్గొట్టడం ద్వారా అక్రమాస్తులు కూడబెట్టారని విజయసాయి పేర్కొన్నారు . రవి ప్రకాష్ మీద ఈ తరహా వ్యాఖ్యలు చేసేంత కక్ష విజయ సాయికి దేనికి అన్నది పెద్ద ప్రశ్నే .

మోసం చెయ్యటం , హవాలాకు పాల్పడటంపై లేఖ రాసిన విజయసాయి

మోసం చెయ్యటం , హవాలాకు పాల్పడటంపై లేఖ రాసిన విజయసాయి

అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకుల్ని మోసం చేసిన మొయిన్‌ ఖురేషి, సీబీఐ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్‌తో కలసి‌ ఎంతో మందిని‌ రవి ప్రకాష్ మోసం చేశారని లేఖలో పేర్కొన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. ఇలా చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో రవి ప్రకాష్ గురించి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయనపై నా పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలుస్తోంది.

వాళ్ళతో దోస్తీనే విజయసాయి లేఖ రాయటానికి కారణమా ?

వాళ్ళతో దోస్తీనే విజయసాయి లేఖ రాయటానికి కారణమా ?

ఇక గత నెలలోనూ రామేశ్వరరావు, మేఘ కృష్ణారెడ్డి అనుచరుడు రామారావు లిఖితపూర్వకంగా రవి ప్రకాశ్ మీద ఆరోపణలు గుప్పిస్తూ వివిధ శాఖలకు లేఖలు పంపారని అయితే ఇవన్నీ గాలి ఆరోపణలని అధికారులు తేల్చారని రవిప్రకాశ్ మేనేజర్ తెలిపారు. రామారావు పంపిన లేఖ ప్రతినే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజయసాయిరెడ్డి తన లెటర్ హెడ్ పై పంపించారని చెప్పారు. వీరు చేసిన నిరాధారమైన ఆరోపణలను ప్రసారం చేసిన చానళ్లపై కూడా కోర్టులను ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇక రవి ప్రకాష్ వర్సెస్ విజయసాయి రెడ్డి వివాదం ముందు ముందు మరెన్ని ఆరోపణలకు, ఘర్షణలకు కేంద్రబిందువు కానుందో అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. కానీ అలందా మీడియా కు సంబంధించిన వివాదంలో విజయసాయి జోక్యం మాత్రం అందరికీ ఒక పెద్ద ఫజిల్ లాగాకనిపిస్తుంది. ఒక మీడియా సంస్థకు సంబంధించిన మ్యాటర్ లో విజయ సాయి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు అన్న భావన కలుగుతుంది.

English summary
The controversy between Vijay Sai Reddy vs. Ravi Prakash is getting worse day by day. YSRCP MP Vijay Sai Reddy has written to the Supreme Court Chief Justice demanding a CBI inquiry into the scam and his scams on Raviprakash's assets. Ravi Prakash is blaming this letter. Former CEO of TV9 Raviprakash has decided to Defamation claim Rs. 100 crores is said to be libel. The manager of the Raviprakash said this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more