చిరంజీవి సినిమాపై చంద్రబాబు కుట్ర!: రాజకీయ రంగు.. నిజాలేమిటి?
ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుక వేదిక పైన పరోక్షంగానైనా ప్రస్తావన రాకపోవడం, మంత్రులు హాజరు కావడం, స్టేజ్ స్పాన్సర్‌గా ప్రభుత్వ పథకం కూడా ఉండటం చూస్తుంటే.. కుట్ర, ఆటంకాలు అన్నీ వట్టివే అంటున్నారు.
విజయవాడ: చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలకు చంద్రబాబు ప్రభుత్వం ఆటంకాలు సృష్టించిందని కొందరు అభిమానులు మండిపడ్డారు. ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే, అదంతా వట్టిదేనని, ఊహాగానాలేనని వెల్లడవుతోందని అంటున్నారు.
అందుకు పలు కారణాలు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గుంటూరు జిల్లాలోని హాయ్‌ల్యాండ్సులో అంగరంగా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస రావులు హాజరయ్యారు. వీరి గురించి చిరంజీవి సానుకూలంగా మాట్లాడారు.

అదే సమయంలో
ఖైదీ నెంబర్ 150 చిత్రం పైన ప్రభుత్వం కుట్ర చేస్తుందనే దాని పైన ఈ వేడుక సందర్భంగా చిరంజీవి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మాట్లాడుతారనే ప్రచారం సాగింది. చిరంజీవి ఏమీ మాట్లాడలేదు. పైగా మంత్రుల గురించి సానుకూలంగా మాట్లాడారు.

మరో ఆసక్తికర విషయం ఏమంటే..
ఏపీ ఫైబర్ నెట్ కూడా ఖైదీ నెంబర్ 150 సినిమాకు స్టేజ్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏప ఫైబర్ నెట్.. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటర్నెట్ పథకం. వేడుకను అడ్డుకోవాలనుకుంటే భాగస్వామి ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అంటే, అదంతా వట్టి ప్రచారమేనని అర్థమవుతోందని అంటున్నారు.

వేదిక పైన
పరోక్షంగానైనా ప్రస్తావన రాకపోవడం, మంత్రులు హాజరు కావడం, వారి పట్ల హీరో సానుకూలంగా స్పందించడం, స్టేజ్ స్పాన్సర్‌గా ప్రభుత్వ పథకం కూడా ఉండటం చూస్తుంటే.. కుట్ర, ఆటంకాలు అన్నీ వట్టివేనని అంటున్నారు.

సోషల్ మీడియాలోను
పెద్ద ఎత్తున దుమారం రేగింది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ, ఏపీలో అధికారంలో ఉన్నది టిడిపి కాబట్టి అందుకే వేడుకకు ఒప్పుకోలేదని, కుట్ర జరుగుతోందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారంటున్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications