వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ - కలవని షర్మిల : తల్లితో కలిసి కేక్ కట్ చేసి...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

సీఎం జగన్ పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసారు.ప్రతీ ఏటా వైఎస్సార్ కుటుంబం మొత్తం పులివెందులలో కలిసి క్రిస్మస్ జరుపుకోవటం ఆనవాయితీ. అదే విధంగా జగన్ సీఎం అయిన తరువాత సైతం ఇదే విధంగా ప్రతీ క్రిస్మస్ కు పులివెందులకు వెళ్తున్నారు. మూడు రోజుల కడప పర్యటనలో భాగంగా జగన్ జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శుక్రవారం ఇడుపుల పాయలోని తండ్రి ఘాట్ వద్ద నివాళి అర్పించారు.

సీఎం జగన్ క్రిస్మస్ వేడుకలు

సీఎం జగన్ క్రిస్మస్ వేడుకలు

ముందుగా జగన్ నివాళి అర్పించగా.. ఆ తరువాత తల్లి విజయమ్మ ఘాట్ వద్ద వైఎస్సార్ కు నివాళి అర్పించారు. ఆ వెంటనే ఇడుపుల పాయలోని ప్రార్ధనా మందిరంలో జరిగిన ప్రార్దనల్లో పాల్గొన్నారు. ఇక, ఈ రోజు భాకరాపురంలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రార్ధనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. తల్లి విజయమ్మ..సతీమణి భారతి.. ఎంపీ అవినాశ్ రెడ్డి తో సహా పలువురు హాజరయ్యారు. అయితే, ఈ సారి సైతం జగన్ సోదరి షర్మిల క్రిస్మస్ వేడుకలకు హాజరు కాలేదు. గత ఏడాది షర్మిల రాలేదు. జగన్ - షర్మిల మధ్య వచ్చిన బేదాభిప్రాయాల కారణంగానే దూరంగా ఉన్నారనే ప్రచారం సాగింది.

ఈ ఏడాది కనిపించని షర్మిల

ఈ ఏడాది కనిపించని షర్మిల


ఇక, తెలంగాణలో రాజకీయంగా పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల తన పార్టీ ఏర్పాటును తన అన్న జగన్ వ్యతిరేకించారని ఓపెన్ గానే చెప్పారు. ఇక, తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం తోనూ పోరాడుతానని షర్మిల పలు మార్లు చెప్పారు. ఈ ఏడాది జూలై 8న వైఎస్సార్ జన్మదినం నాడు జగన్ - షర్మిల ఇద్దరూ ఇడుపులపాయలోనే ఉన్నా..ఇద్దరూ వేర్వేరుగా సమయాల్లో తమ తండ్రికి నివాళి అర్పించారు. ఇక, సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు ముందు రోజునే జగన్ - షర్మిల..విజయమ్మ ఇడుపుల పాయ చేరుకున్నారు.

తల్లి విజయమ్మతో కలిసి ప్రార్దనల్లో

తల్లి విజయమ్మతో కలిసి ప్రార్దనల్లో

వర్దంతి నాడు ఇద్దరూ కలిసే నివాళి అర్పించినా..అక్కడ కలిసి మాట్లాడుకున్న సందర్భం కనిపించ లేదు. అయితే, ఆ తరువాత ఒక ఇంటర్వ్యూలో అక్కడ కలిసిన సమయంలో ఇద్దరం పలకరించుకున్నామని..కలిసి డిన్నర్ చేసామని షర్మిల చెప్పుకొచ్చారు. రాఖీ పండుగ నాడు సైతం షర్మిల ఫోన్ చేసి విషెస్ చెప్పినట్లుగా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఇప్పుడు క్రిస్మస్ సమయంలో అన్నా - చెల్లి కలుస్తారా లేదా అనే చర్చ సాగింది. కానీ, షర్మిల క్రిస్మస్ కు సైతం పులివెందులకు దూరంగానే ఉన్నారు.

షర్మిల రాకపోవటం పైన చర్చ

షర్మిల రాకపోవటం పైన చర్చ


షర్మిల గురువారం రాత్రి వరకు ఇడుపులపాయలోనే ఉన్నారని...ఆ రాత్రే వెళ్లిపోయారనే కధనాలు వినిపిస్తున్నా..దానిని ఎవరూ నిర్ధారించటం లేదు. ఇక, క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొన్న విజయమ్మ - జగన్ కలిసి కేక్ కట్ చేసారు. తన కుమారుడిని విజయమ్మ ముద్దాడారు. ఆ తరువాత జగన్ అక్కడ ముందుగా నిర్ణయించిన విధంగా కార్యక్రమాల్లో పాల్గొని విజయవాడ బయల్దేరారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ పర్యటనకు రావటంతో ఆయన గౌరవార్ధం సీఎం జగన్ ఏపీ ప్రభుత్వం తరపున తేనేటి విందు ఏర్పాటు చేసారు.

English summary
CM Jagan Participated in Christmas celebrations in Pulivenudla along with family memebrs, Sharmila did not attend the celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X