ఆది ఎఫెక్ట్: రామసుబ్బారెడ్డికి బాబు చెక్, 2019లో సహకరించేనా?
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిరినట్టేనా, 2019 ఎన్నికల్లో ఈ రెండు గ్రూపులు కలిసి పనిచేస్తాయా, ఈ ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్టు కేటాయిస్తారు.
కడప: కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిరినట్టేనా, 2019 ఎన్నికల్లో ఈ రెండు గ్రూపులు కలిసి పనిచేస్తాయా, ఈ ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్టు కేటాయిస్తారు, రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగానే కొనసాగుతారా, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాలు లేవా అనే చర్చ సాగుతోంది.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ మంత్రి , ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య చాలా కాలంగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి.
ఈ కారణంగానే ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, పార్టీ అసవరాల రీత్యా ఆదినారాయణరెడ్డిని టిడిపి చేర్చుకొన్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో వారం క్రితమే రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కింది.
కార్పోరేషన్ చైర్మెన్ పదవిని కూడ ఇవ్వాలనే యోచన ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుండి టిడిపి టిక్కెట్టు ఎవరికి దక్కుతోందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

2019లో జమ్మలమడుగు టిడిపి టిక్కెట్టు ఎవరికీ?
జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుండి ఆదినారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆదినారాయణరెడ్డి చేతిలో 2014లో జరిగిన ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో రామసుబ్బారెడ్డి టిడిపి అభ్యర్థిగా, ఆదినారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీచేశారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కూడ టిడిపిలోనే ఉన్నారు. ఆదినారాయణరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. దీంతో వచ్చే ఎన్నికల్లో రామసుబ్బారెడ్డికి టిక్కెట్టు దక్కే అవకాశాలు ఉండకపోవచ్చని ఆదినారాయణరెడ్డి వర్గీయులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి పోటీచేసే అవకాశాలు లేవనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video


రామసుబ్బారెడ్డి వర్గీయులు సహకరించేనా?
ఈ రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి. ఈ గొడవల్లో రెండు గ్రూపులకు చెందిన వారు హత్యలకు, దాడులకు గురయ్యారు. అయితే ఈ రెండు గ్రూపుల మధ్య సయోధ్య సాధ్యమా అనే చర్చ సాగుతోంది. అయితే పైకి రెండు గ్రూపులు కలిసే పనిచేయాలని పార్టీ నాయకత్వం చెబుతోంది. నేతలు కూడ చెబుతున్నారు కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్దంగా ఉండేలా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి పోటీచేయకుండా ఆదినారాయణరెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగితే రామసుబ్బారెడ్డి వర్గీయులు ఏ మేరకు సహకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే
2019 ఎన్నికల సమయానికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉంది. ఒక వేళ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే పరిస్థితి ఏమిటనేది కూడ చర్చ సాగుతోంది.అయితే వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం లేదని కేంద్రం సంకేతాలు ఇచ్చింది. దరిమిలా ఓకే ఒరలో రెండు కత్తులు ఇమిడే పరిస్థితి ఉంటుందా అనేది చర్చ సాగుతోంది.

నేతల మాటను వింటారా?
రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలున్నాయి. అయితే ఈ గొడవల నేపథ్యంలో రెండు వర్గాలకు చెందినవారు హత్యలకు గురయ్యారు. ఆ కుటుంబాలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే క్షేత్రస్థాయిలో ఒకరంటే మరోకరికి పడని పరిస్థితులున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఒక వర్గానికి మరో వర్గం ఏ మేరకు సహకరిస్తోందో అనేది అనుమానాస్పదమే.












Click it and Unblock the Notifications