బెయిల్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్ళింది ఎందుకు? ఆప్షన్లతో జగన్ టార్గెట్ గా లోకేష్

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించటానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని అనేక ప్రధాన సమస్యలపై రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్ ఢిల్లీ టూర్ టార్గెట్ చేసిన లోకేష్

జగన్ ఢిల్లీ టూర్ టార్గెట్ చేసిన లోకేష్

బెయిల్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్ళింది ఎందుకు? అంటూ ప్రశ్నించిన లోకేష్ మూడు ఆప్షన్లు ఇచ్చి ఏది కరెక్టో చెప్పాలంటూ ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ను టార్గెట్ చేసిన లోకేష్ రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటే తనపై ఉన్న కేసుల విచారణ ఆలస్యం చేయడానికి షరతు పెట్టడానికి ఢిల్లీ వెళ్లారా? లేక ప్రత్యేక హోదా తాకట్టు పెట్టుకుని అప్పు ఇమ్మని అడుక్కోవడానికి ఢిల్లీ వెళ్లారా? లేక పోలవరం ప్రాజెక్టు ఆపేసినా పర్వాలేదు బాబాయిని వేసేసిన కేసులో తనను కాపాడమని వేడుకోవడానికి ఢిల్లీ వెళ్లారా? అంటూ మూడు ఆప్షన్లు ఇచ్చి ప్రశ్నించారు.

జగన్ రెడ్డి అవినీతి అరికడతాం అంటూ యాప్.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యటమే

జగన్ రెడ్డి అవినీతి అరికడతాం అంటూ యాప్.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యటమే

అంతేకాదు ప్రభుత్వ సేవలకు ఎవరైనా లంచం అడిగితే వెంటనే మీ జేబులోని ఫోన్లో నుంచి 14400 కు వీడియో గాని ఆడియో గాని రికార్డు చేసి పంపితే, వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ చేసిన ప్రకటన నేపధ్యంలో రండి కలిసి రండి అవినీతిని అరికడదాం అంటూ జగన్ మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని టార్గెట్ చేశారు లోకేష్ దేశంలోనే అత్యంత అవినీతి పరుడై సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటోన్న జ‌గ‌న్‌రెడ్డి అవినీతిని అరికడదామంటూ యాప్ ఆవిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మే అంటూ మండిపడ్డారు.

అవినీతి అనకొండ వైయస్ జగన్.. ఆ విచారణకు దమ్ముందా.. ప్రశ్నించిన లోకేష్

అవినీతి అనకొండ వైయస్ జగన్.. ఆ విచారణకు దమ్ముందా.. ప్రశ్నించిన లోకేష్

యాప్‌కి 14400 నెంబ‌ర్‌ కాకుండా, 6093 అయితే యాప్ట్‌గా ఉండేది అని తేల్చి చెప్పారు. అవినీతి చూస్తూ ఉండొద్దు, అవినీతి గురించి వింటూ ఉండొద్దు, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పండి అంటూ లెక్చర్ ఇస్తోన్న అవినీతి అనకొండ వైయస్ జగన్ గారు అంటూ మండిపడిన లోకేష్ అవినీతిపై ఈ నేతిబీర క‌బుర్లు మాని మీ పై ఉన్న అవినీతి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని కోరే దమ్ము ఉందా అంటూ జగన్ కు సవాల్ విసిరారు. సీఎం జగన్ ఢిల్లీ టూర్ ను టార్గెట్ చేసి జగన్ అవినీతిపై మరోమారు విరుచుకుపడ్డారు లోకేష్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+