మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారు!!
నేటి నుండి మృగశిర కార్తె ప్రారంభం అయ్యింది. మృగశిర కార్తె రోజు రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. జూన్ మొదటి వారంలో మృగశిర కార్తె వస్తుంది. ఈ ఏడాది జూన్ 8 వ తేదీన మృగశిర కార్తె మొదలైంది. వర్షాకాలానికి నాంది పలికే మృగశిర కార్తె నాడు చాలా మంది కచ్చితంగా చేపలు తింటారు.
మృగశిర కార్తె నాడు చేపలు ఎందుకు తింటారు?
అసలు ఈ రోజు ఎందుకు చేపలు తింటారు? మృగశిర కార్తె నాడు చేపలు తినటం వలన ఏం జరుగుతుంది? తెలుసుకుందాం. సహజంగా చేపలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది నమ్ముతారు. వైద్యులు కూడా చికెన్, మటన్ కంటే చేపలే ఎక్కువ తినాలని చెప్తారు. అయితే మృగశిర కార్తె నాడే ఎందుకు అన్నది చాలా మందికి తెలీదు.

వానాకాలానికి మృగశిర కార్తె నాడు చేపలు తినడానికి సంబంధం
ఇక మృగశిర కార్తెలో తొలకరి జల్లులు కురవడంతో అందరూ ఎండ తాపం నుంచి ఉపశమనం పొందుతారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు వచ్చి వాతావరణం చల్లబడి ప్రకృతి లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక వాతావరణంలో జరిగే మార్పులకు, మృగశిర కార్తె నాడు చేపలు తినడానికి సంబంధం ఉంటుందని చెప్తున్నారు.
సీజనల్ వ్యాధుల నుండి కాపాడే ఇమ్యూనిటీ
మృగశిర కార్తె నాడు చేపలు తినడం వల్ల ఆస్తమా, గుండె జబ్బుల రోగులకు ఉపశమనం దొరుకుతుందని నమ్ముతారు. వర్షాకాలం ప్రారంభంలో చేపలు తినడం మన శరీరంలో ఇమ్యునిటీని మరింత పెంచి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుందని చెప్తారు. ఈ కారణంగానే మృగశిర కార్తె నాడు చేపలు తినడం మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తున్న ఆచారంగా ఉంది.
మృగశిర కార్తె నాడు చేపలు తినటం ఆనవాయితీ ఇందుకే
వర్షాకాల సీజన్ లో రోగాల బారిన పడకుండా కాపాడుకోవటం కోసమే మన పూర్వీకులు చేపలు తినటాన్ని ఆనవాయితీగా పెట్టారు. దానిని కొనసాగిస్తూ నేటికి మృగశిర కార్తె రోజు దాదాపు చాలా మంది చేపలే వండుకుంటారు. ఈ రోజు ఫిష్ మార్కెట్ లు అన్నీ చేపల కోసం వచ్చిన జనాలతో కిటకిటలాడాయి.












Click it and Unblock the Notifications