రైలు పట్టాల మధ్య కంకర ఎందుకు ఉంటుంది?
రైల్వే ట్రాక్‌పై మనకు చిన్న చిన్న గులకరాళ్లు కనిపిస్తుండటం సహజం.
భారతీయ రైళ్ల విషయంలో ఎప్పటికీ మారనిది ఏదైనా ఉందంటే, పట్టాల మధ్య కనిపించే కంకర రాళ్లు మాత్రమే. ఒకప్పుడు బొగ్గుతో రైళ్లు ఇప్పుడు విద్యుత్తుతో నడుస్తున్నాయి. పాతకాలం నాటి రైళ్ల నుంచి ఇప్పుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వరకు సాంకేతికత బాగా పెరిగిపోయింది. ఎంత సాంకేతికత వచ్చినా ఎప్పుడూ అలాగే ఉండేవి ఏమిటంటే.. రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు.
రైల్వే ట్రాక్‌పై మనకు చిన్న చిన్న గులకరాళ్లు కనిపిస్తుండటం సహజం. దేశవ్యాప్తంగా ఎక్కడ రైల్వే ట్రాక్ చూసినా ఈ రాళ్లను గమనిస్తుంటాం. కానీ అసలు రైలు పట్టాల మధ్య ఈ రాళ్లు ఎందుకు ఉంటాయన్న సందేహం ఎవరికీ కలగదు. అతి కొద్ది మందికే ఇటువంటి సందేహం వస్తుంది.
రైల్వే ట్రాక్‌ల మధ్య, వాటికి ఇరువైపులా గులకరాళ్లు ఉండడానికి పలు కారణాలున్నాయి. ఈ రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ అంటారు. రైలు ఎంత బరువు ఉంటుందో మనందరికీ తెలుసు.. భారీ కంపార్ట్‌మెంట్లతో అతి పెద్దగా ఉన్న రైలు, పట్టాలపై వెళ్లే సమయంలో భారీ కంపనాలు వస్తుంటాయి.

అతి పెద్ద శబ్దంతో పాటు సమీపంలోని నిర్మాణాలు, భవనాలకు ముప్పుగా ఉంటుంది. ఆ ముప్పు తొలగించడానికే ఈ పదునైన రాళ్లను రైల్వేశాఖ ఉపయోగిస్తోంది. ఇదొక్కటే కాకుండా రైలు పట్టాలపై మొక్కలు, పిచ్చి చెట్లు పెరగడాన్ని కూడా కంకర నిరోధిస్తుంది.
వర్షాకాలంలో రైలు పట్టాలపై నీళ్లు నిలిచిపోకుండా ఉండటానికి కారణం ఈ కంకరే. పట్టాలపైకి వచ్చే వర్షపు నీరు ఈ కంకర నుంచి కిందకు వెళ్లి సమీపంలోని కాల్వలోకానీ, డ్రెయినేజీలోకానీ కలిసిపోతుంది.
ఈ చిన్న రాళ్లే కాకుండా రైల్వే ట్రాక్‌పై కాంక్రీట్‌తో చేసిన పొడవాటి ప్లేట్‌లు కూడా చూసే ఉంటారు. ఆ ప్లేట్లపైనే ట్రాక్‌లు వేస్తారు. వీటిని స్లీపర్స్ అంటారు. ట్రాక్ బ్యాలస్ట్‌లు కూడా ఈ స్లీపర్‌లకు స్థిరత్వాన్ని అందించడంలో తోడ్పడతాయి.
రైలు ప్రయాణించే సమయంలో స్లీపర్, బ్యాలస్ట్ కలయిక దాని బరువును మాత్రమే భరించి, ప్రమాదం సంభవించే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇలా ట్రాక్‌ల మధ్యలో ఉన్న కంకర రాళ్లు రైలు సాఫీగా ముందుకు సాగడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి.












Click it and Unblock the Notifications