జగన్‌కు అంత ఆతృత ఎందుకో అర్థం కావట్లేదు: నారా లోకేష్
చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మండిపడ్డారు.
ఒక వ్యక్తి స్వార్థం వల్లే ఈ ఎన్నికలు వచ్చాయని చెప్పారు. ప్రజలు దానిని గుర్తించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ప్రభుత్వం నిరంతర విద్యుత్ ఇస్తోందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఇప్పుడు తొలి దశవే అన్నారు.
ప్రస్తుతం పెంచిన ధరలు ప్రజలకు అంతగా భారం కాదని చెప్పారు. తాము ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. దీక్షల పేరుతో వైయస్ జగన్ ఎందుకు అంత ఆత్రుత ప్రదర్శిస్తున్నారో ఏమాత్రం అర్థం కావడం లేదని చెప్పారు.

విగ్రహాల తొలగింపుపై వివరణ కోరిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో అనుమతి లేని విగ్రహాల తొలగింపుపై ఏపీ సీఎస్ ఐవైఆర్‌ను హైకోర్టు వివరణ కోరింది. దీనికి ఏపీ ప్రభుత్వం 15 రోజుల గడువు కోరింది. దీంతో విగ్రహాలను తొలగించాలని, 15రోజుల్లోగా నివేదిక అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.
ఇదే విషయమై ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడారు. విగ్రహాలు పెట్టినవారితో మాట్లాడతామని, వారి మనోభావాలకు భంగం కలగకుండా విగ్రహాలను తొలగించడమో, లేక అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడమో చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications