కెసిఆర్ రాజీనామా ఎందుకడగరు: జగన్‌పై గాలి, రఘువీరా సైతం...
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వేర్వేరుగా విరుచుకుపడ్డారు. జగన్‌కు తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించే అర్హత లేదని రఘువీరా రెడ్డి అన్నారు.
వైఎస్ జగన్ సీఎం అయ్యేది లేదు, హంద్రీనీవా కట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత గాలిముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ ఐదేళ్లు అధికారంలో ఉండి రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, కనీసం పులివెందులకూ నీరు ఇవ్వలేదని విమర్శించారు.

ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్ రాజీనామాకు జగన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆయన జగన్‌ను ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో జగన్ ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఫోన్ ట్యాపింగ్ సీరియస్ అంశం కాదా అని గాలిముద్దుకృష్ణమ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని ఇతర దేశాలకు అప్పగించడం వల్ల దేశభద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
రాహుల్ పర్యటన కాంగ్రెస్‌కు బలానిచ్చిందని రఘువీరా తెలిపారు. జగన్‌కు రాహుల్‌ను విమర్శించే అర్హత లేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాజమండ్రి తొక్కిసలాటను హత్యగా భావిస్తున్నామని దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications