నాగబాబు మంత్రి పదవికి అక్కడే బ్రేక్, పవన్ నెక్స్ట్ ఛాయిస్..!?

ఏపీ రాజకీయాలు ఆసక్తి కర మలుపులు తీసుకుంటోంది. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తి అవుతోంది. ఈ సమయంలోనే పాలనా పరంగా కీలక నిర్ణయాలకు కూటమి నేతలు సిద్దం అవుతున్నారు. మూడు పార్టీలు సొంతంగా తమ బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీ మంత్రివర్గ విస్తరణ పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి పైన కొత్త డైలమా మొదలైంది. నాగబాబుకు మంత్రి పదవికి మెగా బ్రేక్ పడింది. దీంతో, ఇప్పుడు చంద్రబాబు - పవన్ నిర్ణయం కీలకంగా మారుతోంది.

నాగబాబు మంత్రి అయ్యేనా
ఏపీ ప్రభుత్వంలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల కూటమి ప్రభు త్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవు తోంది. దీంతో, రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తరువాత మంత్రివర్గంలోకి తీసుకోవా లని నిర్ణయించారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడనేది స్పష్టత రావటం లేదు. ఇదే సమయంలో ఏడాది పాలన సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పని తీరు పై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వం పైనా కొత్త చర్చ వినిపిస్తోంది.

why-the-delay-in-nagababu-induct-as-minister-in-ap-cabinet-details-here

మారుతున్న లెక్కలు
ఇప్పటికే ప్రకటించిన విధంగా నాగబాబుకే మంత్రి పదవి ఇవ్వాలా.. లేక, మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే తర్జన భర్జన సాగుతున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు జనసేన నుంచి మంత్రి వర్గంలో ప్రాధాన్యత లేదు. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను కూటమి నేతలు బేరీజు వేస్తున్నారు. ఈ సమయంలో జనసేన ఒక పార్టీగా ముద్ర పడటం నష్టం చేస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీని కారణంగానే నాగబాబుకు మంత్రి పదవి పైన తుది నిర్ణయం జరగలేదని తెలుస్తోంది. అయితే, 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు.. ఆ తరువాత రాజ్యసభ సీటు నాగబాబు త్యాగం చేసారు. దీంతో, ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వనున్నట్లు చంద్రబాబు స్వయంగా వెల్లడించారు.

నాగబాబుకు కాకుంటే
ప్రస్తుతం కేబినెట్ లో నాగబాబు చేరిక వరకే విస్తరణ పరిమితం అవుతుందని కొద్ది రోజుల వరకూ చర్చ జరిగింది. అయితే, మంత్రివర్గ ప్రక్షాళన దిశగా ఆలోచన ఉన్నట్లు కూటమి నేతలు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. దీంతో, సామాజిక సమీకరణాల్లో భాగంగా తిరిగి నాగబాబుకే మంత్రి పదవి ఇస్తే వచ్చే విమర్శల పైనే చంద్రబాబు - పవన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఇదే కారణంతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వలేకపోతే.. కీలకమైన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇస్తారనే వాదన వినిపిస్తోంది. ఆ స్థానంలో జనసేన కు చెందిన విశాఖ సీనియర్ నేత కొణతాలను మంత్రివర్గంలోకి తీసుకోవాలా అనే అంశం చర్చకు వచ్చినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే, నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకుంటే జనసేన కేడర్.. మెగా ఫ్యాన్స్ కు సమాధానం చెప్పుకోలేమనే అభిప్రాయం జనసేన నేతల్లో ఉంది. దీంతో, నాగబాబుకే మంత్రి పదవి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా, మంత్రివర్గ విస్తరణ పైన ఈ వారంలోనే ప్రకటన ఉంటుందని చెబుతున్న వేళ తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+