నాగబాబుకు మంత్రి పదవి వేళ ఢిల్లీ బిగ్ ట్విస్ట్ - పవన్ వాట్ నెక్స్ట్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. పథకాల అమలు పైన ఫోకస్ చేసింది. ఇదే సమయంలో పాలనా పరంగా సంస్కరణల అమలుకు సిద్దం అవుతోంది. మంత్రుల పని తీరు పైన చంద్రబాబు నివేదికలు సిద్దం చేస్తున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవటం ఆలస్యం వెనుక కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో మంత్రివర్గంలో మార్పుల వేళ ఢిల్లీ కేంద్రంగా ఆసక్తి కర సమీకరణా లు మొదలయ్యాయి. దీంతో.. చంద్రబాబు, పవన్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.
నాగబాబుకు పదవి వేళ
ఏపీలో మంత్రివర్గంలోకి నాగబాబుకి అవకాశం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయం గా వెల్లడించారు. అందులో భాగంగా నాగబాబును తొలుత ఎమ్మెల్సీ చేసారు. నెలలు గడుస్తున్నా మంత్రివర్గంలోకి ఇంకా నాగబాబు చేరిక ఖరారు కాలేదు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అంశం పైన తొలుత పవన్ సమర్ధించుకున్నారు. ఇందులో కుటుంబాలు.. సామాజిక వర్గాల ప్రస్తా వన సరి కాదని పేర్కొన్నారు. అయితే, నాగబాబుకు మంత్రివర్గంలోకి తీసుకునే లెక్కల్లో భాగంగా ఢిల్లీలో పరిణామాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. బీజేపీ నుంచి ఏపీలో మరో మంత్రి పదవి పైన ప్రతిపాదన అందినట్లు సమాచారం.

బీజేపీకి మరో బెర్తు
ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఒక్క బెర్తు మాత్రమే ఖాళీ ఉంది. బీజేపీకి అవకాశం ఇవ్వాలంటే ఒక మంత్రిని తప్పించాల్సి ఉంటుంది. అందుకు చంద్రబాబు సిద్దంగా లేరు. ఏడాది కాలమే పూర్తి కావటంతో మంత్రివర్గంలో నాగబాబుకు అవకాశం ఇవ్వటం మినహా.. ప్రక్షాళన ఇప్పుడు సరికాదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ దిశగా కస రత్తు జరుగుతోంది. ఏపీ నుంచి మరో మంత్రికి మోదీ మంత్రివర్గంలో ఛాన్స్ దక్కుతుందనే చర్చ మొదలైంది. జనసేన కు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు విస్తరణలో జనసేన కు ఇవ్వాలనే ప్రతిపాదన తెర పైకి వస్తోంది. జనసేన నుంచి ఇద్దరే ఎంపీలు ఉన్నారు. దీని పైన పవన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సమీకరణాలే కీలకం
కేంద్ర మంత్రివర్గంలో జనసేన చేరుతుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, నాగబాబు విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర కేబినెట్ లో ఛాన్స్ కల్పించి.. రాష్ట్రంలో జనసేన నుంచి బీసీ వర్గానికి చెందిన నేతకు అవకాశం కల్పించాలనే ప్రతి పాదన పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబుకే నిర్ణయం వదిలేయాలని... నాగబాబు కోసం ఒత్తిడి చేయకూడదని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో, ఢిల్లీ పరిణామాలు.. సమీకరణాల ఆధారంగా నాగబాబుకు మంత్రి పదవి పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్ సభ.. రాజ్యసభకు ఛాన్స్ మిస్ అయిన నాగబాబు కు కీలక పదవి అయితే ఖాయమని చెబుతున్నారు. వచ్చే వారి ఈ విషయంలో స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications