విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బద్దకస్తులు, ఎందుకు గెలిపించాలి: బాబుపై పవన్, నీపై గెలుస్తా: జనసేనానికి బుజ్జి సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం/ఏలూరు: తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కార్మికులు, రైతులతో భేటీ అయ్యారు. అక్రమ క్వారీలు, ఇసుక మాఫియాకు స్థానిక నేతలు కొమ్ముగాస్తున్నారని ఆరోపించారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.

Recommended Video

Pawan kalyan Commented On Chandrababu naidu

తాను అనకాపల్లికి వస్తున్నానని తెలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షుగర్ ఫ్యాక్టరీపై సమీక్ష నిర్వహించారన్నారు. నెల రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించకపోతే దీక్ష చేస్తానని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని సూచన చేశారు.

నాకు టిక్కెట్ కాదంటే.. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బాలకృష్ణ చిన్నల్లుడు భరత్?నాకు టిక్కెట్ కాదంటే.. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బాలకృష్ణ చిన్నల్లుడు భరత్?

అవంతి శ్రీనివాస్ అలా అనడం బాధాకరం

అవంతి శ్రీనివాస్ అలా అనడం బాధాకరం

షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సంక్షేమ నిధి కోసం తాము జనసేన పార్టీ తరఫున నిధులు సమీకరిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు బాధించాయని కూడా ఆయన అన్నారు. విశాఖ రైల్వే జోన్ లేదు గీను లేదు అనడం బాధాకరమన్నారు.

చంద్రబాబును మళ్లీ ఎందుకు గెలిపించాలి?

చంద్రబాబును మళ్లీ ఎందుకు గెలిపించాలి?

చంద్రబాబును తిరిగి ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలో చెప్పాలని పవన్ ప్రశ్నించారు. భూకుంభకోణాలపై సిట్ నివేదికను ఎందుకు బయటకు వెల్లడించలేదో చెప్పాలని నిలదీశారు. వారికి భాగస్వామ్యం ఉంది కాబట్టే బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీ తెరిపించకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు.

మన ఎంపీలు బద్దకంగా ఉన్నారు

మన ఎంపీలు బద్దకంగా ఉన్నారు

మన ఎంపీలు చాలా బద్ధకంగా ఉంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజా సమస్యలను వారు పట్టించుకోవడం లేదన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ తన ఉత్తరాంధ్ర పర్యటనలో పలువురిని కలుస్తున్నారు. మంగళవారం ఆయన అనకాపల్లిలో పర్యటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి పోటీ చేస్తే గెలుస్తా

పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి పోటీ చేస్తే గెలుస్తా

పవన్ కళ్యాణ్‌కు ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి సవాల్ విసిరారు. పవన్ ఏలూరు నుంచి పోటీ చేస్తే ఆయనపై తాను గెలుస్తానని వ్యాఖ్యానించారు. జనసేనానిపై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

English summary
Jana Sena chief Pawan Kalyan on Tuesday questioned that why we should elect Nara Chandrababu Naidu as Chief Minister again?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X