చంద్రబాబు, పవన్ పొత్తుతో వైసీపీకి నష్టమేంటి ? దేశంలో తొలి పొత్తులా బెంబేలెందుకు ? రీజన్ ఇదే

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతోంది. మరో రెండేళ్లలో ఎలాగో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి. ఆలోపే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దీనికి ప్రధాన కారణం విపక్ష నేత చంద్రబాబు పొత్తుల పేరుతో రాజకీయాల్ని టర్న్ చేయడమే. దీంతో ఇప్పుడు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ జట్టు కడితే తమకు ఇబ్బందన్న తరహాలో వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. పొత్తుల్లేకుండా చంద్రబాబు పోటీ చేయలేడా అంటూ ప్రశ్నిస్తోంది. చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి వచ్చిన నష్టమేంటో మాత్రం చెప్పలేకపోతోంది.

 చంద్రబాబు-పవన్ పొత్తు

చంద్రబాబు-పవన్ పొత్తు

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా 2014లో పొత్తు పెట్టుకున్నారు.అప్పట్లో జనసేన నేరుగా బరిలోకి దిగకపోవడంతో టీడీపీకి మద్దతిచ్చింది. దీంతో టీడీపీ ఏపీలో పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఐదేళ్లకు 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన ఈ రెండు పార్టీలు నష్టపోయాయి. దాదాపు 40కి పైగా స్ధానాల్లో టీడీపీ ఓట్లను చీల్చిన జనసేన భారీ నష్టమే చేసింది. ఆ మేరకు వైసీపీ భారీగా లబ్ది పొందింది. దీంతో ఈసారి 2024 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మరోసారి జట్టు కట్టేందుకు చంద్రబాబు, పవన్ ముందుకు కదులుతున్నారు.

 వైసీపీలో పెరుగుతున్న గుబులు

వైసీపీలో పెరుగుతున్న గుబులు

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమనే నిర్ణయానికి వైసీపీ వచ్చేసింది. అప్పటి నుంచీ చంద్రబాబు, పవన్ పై విమర్శల వర్షం కురిపిస్తోంది. అయితే ఇప్పటికీ చంద్రబాబు పవన్ ను కలిసి రావాలని కోరుతూనే ఉన్నారు. చంద్రబాబు వినతిపై పవన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయినా వైసీపీ దాడి మాత్రం ఎక్కడా ఆగడం లేదు.

 దేశంలో తొలిసారిలా బెంబేలు

దేశంలో తొలిసారిలా బెంబేలు

మన దేశంలో రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుని పోటీలు చేయడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. ఇందులో కొత్తేమీ లేదు. ఓ రాజకీయ పార్టీ విడిగా పోటీ చేస్తే వచ్చే ఓట్లు, సీట్ల కంటే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేస్తే ఎక్కువ లాభముంటుందని భావిస్తే అలా చేయడంలో తప్పేమీ లేదు. రాజ్యాంగ పరంగా చూసినా ఇది తప్పు కాకపోగా ఆనవాయితీ కూడా. కానీ వైసీపీ మాత్రం ఎక్కడ టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయో అన్నంతగా బెంబేలెత్తుతోంది. దీంతో వైసీపీ భయంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

 వైసీపీ అలా అయితేనే గెలుస్తుందా ?

వైసీపీ అలా అయితేనే గెలుస్తుందా ?

గతంలో 2014 ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుతో నష్టపోయిన వైసీపీ.. 2019 నాటికి వారిద్దరూ విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి తాము గెలిచామనే భ్రమలో ఉంది. దీంతో ఇప్పుడు మరోసారి వారిద్దరూ పొత్తు పెట్టుకుంటే 2014 ఫలితాలు రిపీట్ అవుతాయనే భయం వైసీపీలో పెరుగుతోంది. వైసీపీతో పాటు అధినేత వైఎస్ జగన్ లోనూ అదే భయం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో జిల్లాల టూర్ లో సైతం జగన్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కానీ ఈ అంశాన్ని ఎక్కువకాలం జనంలోకి తీసుకెళ్లినా అది బూమరాంగ్ అయ్యే అవకాశాలూ లేకపోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+