'రోజా వ్యాఖ్యలపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు'
అమెరికాలో జాత్యాహంకార దాడులను ఖండించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దళిత ఎమ్మెల్యే వంగలపూడి అనిత పైన ఆయన పార్టీ ఎమ్మెల్యే రోజా దురహంకారపూరిత వ్యాఖ్యలప
విజయవాడ: అమెరికాలో జాత్యాహంకార దాడులను ఖండించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దళిత ఎమ్మెల్యే వంగలపూడి అనిత పైన ఆయన పార్టీ ఎమ్మెల్యే రోజా దురహంకారపూరిత వ్యాఖ్యలపై స్పందించకపోవడం దారుణమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రోజా 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సూచించిన విధానంలో తనను చైర్మన్‌గా పునర్నియమించేందుకు మూడు నెలలు పట్టిందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతరం సోమవారం బాధ్యతలు చేపడతానని శివాజీ వెల్లడించారు. అతిత్వరలో కమిషన్ కార్యాలయాన్ని విజయవాడ లేదా గుంటూరు తరలిస్తామని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పునర్నియమితులైనందుకు ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆయనను సన్మానించాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్అంటే ప్రతిపక్షం భయపడుతోందని ఎమ్మెల్యే వర్మ ఎద్దేవా చేశారు.
ఆయన ఆస్తులపై సాక్షి పత్రిక, వైసిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. లోకేష్ ఆస్తులు పెరిగితే తప్పేమిటని, ఆయనకు తాతదండ్రుల నుంచి వచ్చాయన్నారు. నీతిగా వ్యాపారం చేసుకొని ఆస్తి పెంచుకున్నారన్నారు.
నీ ఆస్తుల తరహాలో ఆయనవేమైనా ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయా? లోకేశ్‌పై సీబీఐ కేసులు ఏమైనా ఉన్నాయా అని జగన్‌ను నిలదీశారు. జగన్‌కు ధైర్యం ఉంటే ఇద్దరి ఆస్తులపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications