వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టు చలపతి దంపతుల సెల్పీ ఈ పోటో ఆధారంగానే పోలీసుల ఆరా

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం :సుదీర్ఘ కాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన చలపతి పోటోలు పోలీసుల వద్ద లేవు.అయితే చలపతి ఆయన సతీమణి నాలుగు మాసాల క్రితం సెల్ ఫోన్ లో తీసుకొన్న సెల్పీ పోలీసులకు చిక్కింది.ఈ ఫోటో ఆధారంగా పోలీసులు వేట సాగించారు. ఈ సెల్పీ పోలీసులకు కొంత ప్రయోజనాన్ని కల్గించింది.టెక్నాలజీ మావోయిస్టులకు కొంత ఉపకరించినా....తమ ఉనికిని చాటేందుకు టెక్నాలజీ దోహదపడుతోందని మరోసారి రుజువైంది.

భార్యతో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ సెల్ఫీ, చిక్కుల్లో పడేసింది

మావోయిస్టు పార్టీ కోరాపుట్ - శ్రీకాకుళం డివిజన్ కమిటీకి డిప్యూటీ కమాండర్ గా వ్యవహారించిన చలపతి .ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా పనిచేసిన అరుణ లు కలిసి సెల్పీ దిగారు. ఈ సెల్పీ పోలీసులకు చిక్కే వరకు చలపతి, ఆయన సతీమణి అరుణ రూపురేఖలు పోలీసులకు తెలియదు.ఒడిశాలో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరిద్దరూ మరణించారు.

wife,husband,selfi:latest photo of maoist top leader chalapati

చలపతిపై 20 లక్షలు, అరుణపై 5 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది.ఏజెన్సీ ఏరియాలో వీరిద్దరూ యదేచ్చగా తిరిగేవారు.వీరి గుర్తించే ఫోటోలు పోలీసుల వద్ద లేకపోవడం వల్ల చలపతి దంపతులకు ఇబ్బందిలేకుండా పోయింది. వీరి పేరుతో ఉన్న మావోయిస్టుల కదలికలున్నా...వారిని గుర్తించలేకపోయేవారు.
స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించే చలపతి నాలుగు మాసాల క్రితం తన సతీమణి అరుణతో కలిసి సెల్పీ దిగారు.ఈ ఫోటోను అరుణ తన సోదరుడు ఆజాద్ కు పంపింది.ఈ ఫోటోను ఆజాద్ తన ల్యాప్ ట్చాస్ లో భద్రపర్చుకొన్నారు.ఈ ఏడాది మే 4వ, తేదిన కొయ్యూరు మండలంలోని మర్రిపాకలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆజాద్ మరణించారు.ఈ ల్యాప్ ట్యాప్ లో చలపతి సెల్పీ పోలీసులకు దొరికింది.ఈ సెల్పీ ఆధారంగానే పోస్టర్లను ముద్రించి పోలీసులు విస్తృతంగా ప్రచారం చేశారు.

ఈ ఘటనతో సెల్పీలు, స్మార్ట్ పోన్ల వినియోగం చేయకూడదని మావోయిస్టు అభిప్రాయపడింది.అయినా అప్పటికే నష్టం జరిగింది.ఈ సెల్పీ ఆధారంగానే ఒడిశా ఎన్ కౌంటర్ లో వీరిద్దరూ మరణించినట్టుగా పోలీసులు గుర్తించారు.

English summary
maoist top leader chalapati selfi with his wife aruna 4 months back.this photo recently traced police an encounter in may at koyyur.police wide publicity with this selfi photos .this selfi easy to identify an odissa encounter members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X