వివాహేతర సంబంధం: ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య

కర్నూల్:ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది. అయితే నిందితులను సీసీటీవి పుటేజీ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 17వ, తేదిన మల్లిఖార్జున్ అనే వ్యక్తిని భార్య ప్రియుడి సహయంతో హత్యచేయించిందని పోలీసులు ప్రకటించారు.

ప్రియుడి మోజులో పడి భర్తను హత్యచేయించిన ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది. ఫిబ్రవరి 17వ, తేదిన కర్నూల్ జిల్లా బనకచర్లకు చెందిన మల్లిఖార్జున హత్యకు గురయ్యాడు. ఈ హత్య‌కు మల్లిఖార్జున భార్య మహలక్ష్మి, ఆమె ప్రియుడు గోపాల్‌ను పోలీసులు మంగళవారం సోమవారం నాడు అరెస్ట్ చేశారు.

Recommended Video

    అక్రమ సంబంధాలు : భర్తలను చంపిన భార్యల లిస్ట్ !

    ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య మహలక్ష్మి పథకం భర్తను హత్యచేయించిందని పోలీసులు ప్రకటించారు. పథకం ప్రకారం మల్లిఖార్జున్‌ను మద్యం తాగించి హత్యచేసినట్టు పోలీసులు చెప్పారు. సోమవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

    ప్రియుడితో వివాహేతర సంబంధంతో భర్త హత్య

    ప్రియుడితో వివాహేతర సంబంధంతో భర్త హత్య

    కర్నూల్ జిల్లా పాములపాడు మండలంలోని భానకచర్లకు చెందిన మల్లిఖార్జున, మహలక్ష్మిలు భార్య, భర్తలు. అయితే భర్త మల్లిఖార్జునకు తెలియకుండానే భార్య మహలక్ష్మి ఆత్మకూరుకు చెందిన గోపాల్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. అయితే ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు వీలుగా భర్తను హత్య చేయాలని భావించింది. ఈ మేరకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది .

     మద్యం కోసం పిలిచి హత్య

    మద్యం కోసం పిలిచి హత్య

    ఫిబ్రవరి 17వ, తేదిన మల్లిఖార్జునను చంపాలని గోపాల్ ప్లాన్ చేశారు.ఈ మేరకు తనకు సహయం చేయాలని గోపాల్ తన స్నేహితుడు జమ్ములయ్యను అడిగాడు.ఇందుకు అతను సరేనని చెప్పాడు. మద్యం తాగుదామని తీసుకెళ్ళి మల్లిఖార్జునను హత్య చేశారు. గోపాల్‌, జమ్ములయ్యలు ఈనెల 17న రాత్రి మల్లికార్జునను ద్విచక్ర వాహనంపై శ్రీచక్ర మద్యం దుకాణం వెనక్కు తీసుకువెళ్లి మద్యం తాగించారు.మద్యం మత్తులో ఉన్న మల్లికార్జున తలపై గోపాల్‌ బీరు సీసాతో దాడి చేశారు. పక్కనే బండరాయితో జమ్ములయ్య మోదటంతో తల చిధ్రమయింది.

    పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

    పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

    మల్లిఖార్జున హత్య విషయమై మరునాడే ఆయన భార్య మహలక్ష్మి పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. మల్లిఖార్జున హత్య జరిగిన ప్రాంతంలో సేకరించిన ఆధారాలతో పోలీసులు విచారణ చేశారు. ప్రియుడితో భర్తను హత్య చేయించిన మహలక్ష్మి ఏం తెలియనట్టుగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు.

    కేసు దర్యాప్తులో సీసీటీవి పుటేజీ కీలకం

    కేసు దర్యాప్తులో సీసీటీవి పుటేజీ కీలకం

    ఈ కేసును చేధించడంలో పోలీసులకు సీసీ కెమెరాలు ఉపయోగపడ్డాయని ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి చెప్పారు. హత్య జరిగిన రోజున మల్లికార్జున స్థానిక ఉడిపి హోటల్‌లో గది తీసుకున్నారు. లాడ్జీలో ఉన్న మల్లికార్జునను 17వ తేదీ రాత్రి 8.53 గంటలకు ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లారు. ఈ చిత్రాలు లాడ్జీ, పెట్రోలు బంకు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితులు గోపాల్‌, స్నేహితుడు జమ్ములయ్యలు అదే రోజు మధ్యాహ్నం శ్రీచక్ర మద్యం దుకాణంలో కూర్చుని మద్యం తాగిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డయ్యాయని పోలీసులు చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+