భర్తను నరికి చంపిన భార్య: ప్రేయసి ఆత్మహత్యతో....

 Wife kills husband, lover commits suicide
కర్నూలు/ నెల్లూరు: కర్నూలు జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తనే ఓ భార్య దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో బుధవారం రాత్రి చేటు చేసుకుంది. చిట్టెమ్మ అనే మహిళ నిద్రిస్తున్న భర్త గొల్ల సంజన్నను వేట కొడవలితో నరికి చంపింది.

భర్త అక్కడికక్కడే మరణించాడు. అలికిడికి నిద్ర లేచిన సొంత తల్లిని కూడా ఆమె వదిలిపెట్టలేదు. తల్లి లక్ష్మీదేవిపై ఆమె దాడి చేసింది. చిట్టెమ్మ, సంజన్న తరుచుగా గొడవపడుతుండేవారని అంటున్నారు. గాయపడిన లక్ష్మీదేవి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ కలహాల కారణంగానే ఆ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుండగా, ప్రేయసి ఆత్మహత్య చేసుకుందని కలత చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని డిఎస్పీకి లేఖ ఇచ్చేందుకు వచ్చి అతను స్పృహ తప్పి పడిపోయాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పుబోయడగుల గ్రామంలో చోటు చేసుకుంది.

గురవయ్య అనే యువకుడు కావలి పట్టణంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కావలిలో ఉంటూ అప్పుడప్పుడు తిరుపతికి వెళ్లి వస్తుండేవాడు. జనతాపేటలోని వస్త్ర దుకాణం యజమాని బాబు అనే వ్యక్తితో అతనికి పరిచయం ఉంది.

బుధవారం సాయంత్రం బాబుకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని, చదువు కోసం తనకు చేసిన సహాయం మరువలేనిదని చెప్పాడు. ఆ తర్వాత సెల్‌ఫోన్ ఆఫ్ చేశాడు. పురుగుల మందు తాగి డిఎస్పీ బాలవెంకటేశ్వర రావుకు లేఖ ఇచ్చేందుకు కావలి వచ్చాడు. ఆ విషయాన్ని గమనించి గురవయ్యను పోలీసులు అస్పత్రిలో చేర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+