ఏపీలో పార్టీలు అజెండాలు మార్చుకోవాల్సిందేనా ? రోజుకో ట్విస్ట్ తో రంజుగా రాజకీయం.. !

ఏపీలో నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం నల్లేరుపై నడకేనని అంతా భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా వేగం పుంజుకున్న రెండు కీలక కేసుల విచారణలు, దర్యాప్తులతో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వంతో పాటు విపక్షాలు కూడా వచ్చే ఏడాది ఎన్నికల అజెండాను సెట్ చేసుకుని దాన్ని అమలు చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మారుతున్న పరిణామాలు ఆయా పార్టీలను ఆలోచనలో పడేస్తున్నాయి.

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రెండు కీలక కేసులు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఇందులో ఒకటి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కాగా.. రెండవది వైఎస్ జగన్ పై నాలుగేళ్ల క్రితం జరిగిన కోడి కత్తి దాడి కేసు. ఈ రెండు కేసుల్లో ఇప్పుడు రోజు రోజుకీ వేగం పెరుగుతోంది. రెండు కేసుల్లోనూ కోర్టులతో పాటు దర్యాప్తు సంస్ధలు కూడా ఒక్కసారిగా స్పీడ్ పెంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలన విషయాలు బయటపెడుతున్నాయి.

partyflags

మరోవైపు వైఎస్ వివేకా కేసులో ఏకంగా సుప్రీంకోర్టు జోక్యంతో కేసు విచారణ వేగంగా సాగుతోంది. ఈ నెలాఖరులోగా ఛార్జిషీట్ వేసేందుకు సీబీఐ సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితుల్ని గుర్తించిన సీబీఐ.. వారిని దోషులుగా నిరూపించేందుకు తగిన ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది. అటు కోడి కత్తి కేసులోనూ ఎన్ఐఏ అదే స్పీడ్ కొనసాగిస్తోంది. ఇప్పటికే విజయవాడ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో ఎన్ఐఏ సంచలన విషయాలు బయటపెట్టింది. వీటిపై త్వరలో కోర్టు విచారణ పూర్తయి తీర్పు కూడా రావాల్సి ఉంది.

ఈ రెండు కేసుల్లో దర్యాప్తు సంస్ధలు, కోర్టుల దూకుడుతో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి ఈ రెండు కేసుల్లోనూ ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఎంతుందో, ఊరట లభించే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి. దీంతో విపక్షాలు కూడా వీటిపై ఎక్కువగా స్పందించేందుకు ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు దూకుడుగా మాట్లాడితే రేపు ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయం విపక్షాల్లో ఉంది.

vivekaseenu

దీంతో కోర్టుల్లో జరుగుతున్న విచారణలపై విపక్షాలు మౌనంగానే ఉంటున్నాయి. మరోవైపు ఇప్పటికే వచ్చే ఎన్నికలకు అజెండాలు సెట్ చేసుకున్న పార్టీలకు ఈ రెండు కేసుల్లో వెలువడే తీర్పులతో వాటిని మార్చుకోవాల్సిన అవసరం వస్తుందా అన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+