Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో కుల గణన మొదలుపెట్టేశారా ? తల్లికి వందనంలో కీలక నిర్ణయం..!

దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టేందుకు కేంద్రం వేగంగా అడుగులేస్తోంది. గతంలో కుల గణనకు ససేమిరా అంటూ వచ్చిన కేంద్రం.. తాజాగా రూటు మార్చింది. జన గణన సమయంలోనే కుల గణన కూడా చేపట్టేందుకు అంగీకరంచింది. దీంతో విపక్షాల చిరకాల డిమాండ్ నెరవేరినట్లయింది. ఇదే క్రమంలో ఏపీలోనూ ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు కులగణన చేపట్టాల్సి ఉంది. అయితే అంతకు ముందే ఏపీ ప్రభుత్వం కులగణన దిశగా ఓ అడుగు వేసేసింది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ఇచ్చిన తల్లికి వందనం పథకం హామీ నెరవేర్చేందుకు ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా మిగిలిన అన్ని మార్గదర్శకాలతో పాటు లబ్దిదారులు కులంతో పాటు ఉపకులం కూడా చెప్పాలని కోరింది. దీంతో ఈసారి జనాభా గణన సమయంలో చేసే కుల గణనలో అడిగే ఉప కులం వివరాలు అడుగుతున్నట్లు అవుతోంది. దీంతో రాష్ట్రంలో ముందే కుల గణన ప్రారంభమైందా అన్న చర్చ సాగుతోంది.

will ap government begin caste census earlier asking sub-caste from talliki vandanam beneficiaries

గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ఇదే తల్లికి వందనం పథకం ప్రారంభించారు. అప్పట్లో ఐదేళ్ల పాటు అమలు చేసిన ఈ పథకం లబ్దిదారుల నుంచి కులం వివరాలు మాత్రమే అడిగేవారు. అంటే కేవలం జనరల్ (ఓసీ), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీయా అనే వివరాలు మాత్రమే అడిగేవారు. బీసీల్లో ఏ కులం, ఎస్సీ, ఎస్టీల్లో ఓ ఉపకులం అనే వివరాలు అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ వివరాలు కూడా చెప్పాలని తల్లికివందనం పథకం మార్గదర్శకాల్లో పేర్కొనడంతో ముందుగానే ఆ వివరాలు వెల్లడయ్యే అపకాశాలు కనిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+