అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానులపై మారిన కేంద్రం స్టాండ్ ?హైకోర్టులో అలా చెప్పి-కేంద్రమంత్రి వ్యాఖ్యలతో కొత్త చర్చ !

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి స్దానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కూడా పొందినా హైకోర్టులో మాత్రం బ్రేక్ పడింది. అయితే అప్పట్లో హైకోర్టులో రాజధానులపై కేంద్రం సమర్పించిన అఫిడవిట్ కూ, తాజాగా కేంద్రమంత్రుల వ్యాఖ్యలకూ పొంతన లేదు.

 రాజధానులపై కేంద్రం వైఖరి

రాజధానులపై కేంద్రం వైఖరి

ఏపీలో గతంలో అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్న వేళ కేంద్రం గతంలో హైకోర్టులో ఓ కీలక అఫిడవిట్ దాఖలు చేసింది.ఇందులో రాజధానుల ఏర్పాటు విషయంలో తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ఇది ఎంతో ఊరట నిచ్చింది. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ నేతలతో పాటు ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా రాజధానుల విషయంలో స్టాండ్ మార్చినట్లు కనిపిస్తున్నారు.

కేంద్రం అప్పట్లో ఏం చెప్పింది ?

కేంద్రం అప్పట్లో ఏం చెప్పింది ?


గతంలో హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్ లో కేంద్ర హోంశాఖ.. ఏపీలో రాజధానుల ఏర్పాటు వ్యవహారం తమ పరిధిలో లేదని, రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. రాజధానుల ఏర్పాటు అంశం విభజన చట్టం ప్రకారం ఉండాలన్న పిటిషనర్ల వాదనకు భిన్నంగా అది రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోనే ఉందని అప్పట్లో హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ కీలకంగా మారింది. అయితే అంతిమంగా హైకోర్టు మాత్రం భిన్నమైన తీర్పు ఇచ్చింది.

 రాజధానులపై మారిన కేంద్రం స్టాండ్ ?

రాజధానులపై మారిన కేంద్రం స్టాండ్ ?

అప్పట్లో రాజధానుల ఏర్పాటు వ్యవహారం తమ పరిధిలో లేదని, రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం ఆ వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో పర్యటించిన కేంద్రమంత్రి నారాయణ స్వామి అమరావతి రాజధానిని ఇప్పటికే అందరూ గుర్తించారని తెలిపారు. అమరావతిని రాజధానిగా కేంద్రం కూడా గుర్తించడం వల్లే మంగళగిరికి ఎయిమ్స్ ఇచ్చామని, జాతీయ రహదారి కూడా ఇచ్చామన్నారు.

 కేంద్రం తాజా స్టాండ్ ఇదే

కేంద్రం తాజా స్టాండ్ ఇదే

అమరావతి విషయంలో నిన్న కేంద్ర మంత్రి నారాయణ స్వామి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా అందరూ గుర్తించారన్న కేంద్రమంత్రి.. వివాదాస్పద నిర్ణయాలతో అభివృద్ధి ఆగిపోకూడదన్నారు. తద్వారా మూడు రాజధానులు వివాదాస్పద నిర్ణయమేనన్నారు. అంతే కాదు రెండు రాజధానులు ఏర్పాటు చేసుకుంటారా లేక మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుంటారా తెలియదు కానీ అమరావతిని మాత్రం రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. దీంతో కేంద్రం గుర్తించిన అమరావతి రాజధానిని మాత్రం అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి కోరారు.

English summary
central govt is seems to be change its stand on capital cities in andhrapradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X