కెసిఆర్‌లాగే చంద్రబాబు: జగన్ పార్టీని తుడిచిపెట్టగలరా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అచ్చం తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు మాదిరిగానే ఆలోచిస్తున్నట్లున్నారు. అందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారు.
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను తుడిచిపెట్టే వ్యూహంతో కెసిఆర్ తెలంగాణలో వలసలను ప్రోత్సహిస్తున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ పూర్తి తుడిచిపెట్టుకుపోయే పరిస్థితిలో ఉండగా, కాంగ్రెసు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణలో వరుసగా ఎన్నికలు వస్తుండడంతో వాటిని దృష్టిలో పెట్టుకుని కెసిఆర్ ముందస్తుగానే పథకం ప్రకారం వలసలను ప్రోత్సహిస్తూ ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వస్తున్నారు.
పైగా, సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కూడా కెసిఆర్ చాలా పకడ్బందీగా ప్రచారం కల్పించుకుంటున్నారు. ఈ స్థితిలో ప్రతిపక్షాలకు కార్యక్రమం లేకుండా చేసుతున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి వేరు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంత లేదన్నా బలంగానే ఉంది. 67 మంది శాసనసభ్యులను గెలుచుకుని అధికార తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతూ వస్తోంది.

నాయకులకు, కార్యకర్తలకు కాకుండా జగన్‌కు పార్టీని బతికించుకోవడం అనివార్యమైన పరిస్థితి. తెలంగాణలో టిడిపికి గానీ కాంగ్రెసుకు గానీ ఆ పరిస్థితి లేదు. జగన్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే కాకుండా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి కూడా అనివార్యంగా సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది. పైగా, ఎపిలో ఉన్నన్ని సమస్యలు తెలంగాణలో లేవు. రాజధాని లేకపోవడం, రాజధానికి భూసేకరణ సమస్య, కాపు సమస్య - ఇలా సమస్యలతో ఎపి ఎప్పటికప్పుడు మండుతున్న గోళంగానే ఉంది. ఈ స్థితిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తుడిచిపెట్టి ఏకపక్షంగా గెలవాలనే చంద్రబాబు వ్యూహం ఫలించడం కష్టమే.
దానికితోడు, వైయస్సార్ కాంగ్రెసుతో పొత్తు కూడడానికి బిజెపి కాకపోతే కాంగ్రెసు పార్టీ సిద్ధపడుతుంది. ఎపిలో బిజెపి ఎదగకుండా చూసే వ్యూహాన్ని మిత్రపక్షంగా ఉంటూ చంద్రబాబు అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకుని వచ్చే ఎన్నికల్లో బిజెపి వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో జత కట్టినా ఆశ్చర్యం లేదు. ఒక వేళ బిజెపి అలా రాకుంటే కాంగ్రెసు పార్టీ ఉండనే ఉంది.
దానికి తోడు, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో చేరిన శాసనసభ్యుల సంఖ్య ఎనిమిది. ఆ సంఖ్య పాతికకు చేరినా జగన్‌కు వచ్చే నష్టమేమీ లేదు. అయితే, శాసనసభ్యులను కాపాడుకునే ప్రయత్నంలో జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై దూకుడుగా పోరు సలపడానికి తగిన వ్యవధి దొరకకపోవచ్చు. పైగా, రాయలసీమలో ఓ గ్రూపును టికెట్ల పంపకంలో చంద్రబాబు పక్కన పెట్టాల్సి వస్తే మరో గ్రూపు కచ్చితంగా జగన్ సరసన చేరుతుంది. అందువల్ల జగన్ పార్టీని తుడిచిపెట్టి వచ్చే ఎన్నికలను ఏకపక్షం చేయడం చంద్రబాబు వల్ల కాదనే మాట వినిపిస్తోంది.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం












Click it and Unblock the Notifications