Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ 'కీ'లకం, చెప్తే వీరంతా రెడీ: ఫ్యాన్స్‌కు జగన్ పార్టీ గాలం ఇలా

నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తాననే విషయం తాను రెండు రోజుల్లో చెబుతానని చెప్పారు.

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తాననే విషయం తాను రెండు రోజుల్లో చెబుతానని చెప్పారు.

దీంతో అందరి దృష్టి పవన్ కళ్యాణ్ వైపు మరలింది. ఏ రకంగా చూసినా ఆయన మద్దతు టిడిపికే ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ఇలా చేస్తారా?

పవన్ కళ్యాణ్ ఇలా చేస్తారా?

పవన్ మాటలు టిడిపికి అనుకూలంగా ఉండటం, ప్రజారాజ్యంలో భూమాతో కలిసి పని చేయడం వల్ల భూమా బ్రహ్మానంద రెడ్డికే మద్దతిస్తారని భావిస్తున్నారు. భూమా కుటుంబానికి మద్దతిచ్చేందుకు ఆయన.. తనకు పార్టీలు ముఖ్యం కాదని, నాగిరెడ్డి మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి మద్దతిస్తున్నానని చెప్పవచ్చునని అంటున్నారు. తద్వారా తాను ఇరుకున పడకుండా అలా జాగ్రత్తపడే ప్రయత్నాలు చేయవచ్చునని భావిస్తున్నారు. లేదా తటస్థంగా ఉండవచ్చునని అంటున్నారు.

Recommended Video

    Chandrababu Concerns on Pawan Kalyan.. Why?
    నిర్ణయం కీలకం.. అఖిలప్రియ ఆశలు

    నిర్ణయం కీలకం.. అఖిలప్రియ ఆశలు

    పవన్‌ కళ్యాణ్ నిర్ణయం ఉప ఎన్నికల పోరులో కీలకంగా మారుతుందని, జయాపజయాలను ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పవన్‌ మద్దతు తమకేనని టిడిపి ధీమాగా ఉంది. పవన్‌ కళ్యాణ్‌తో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన అంటే మాకు ఎంతో ప్రేమ, అభిమానమని, తమ రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉంటాయని, నంద్యాల ఉప ఎన్నికలో పవన్‌ మద్దతు మాకే ఉంటుందని అఖిలప్రియ చెప్పారు.

    పవన్ కళ్యాణ్ కోసం వెయిటింగ్

    పవన్ కళ్యాణ్ కోసం వెయిటింగ్

    అక్టోబరు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉంటారని పవన్‌ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. రెండు మూడు నెలల నుంచే జిల్లాల్లో జనసేన సేవాదళ్‌ కార్యకర్తలు క్రియాశీలక సభ్యత్వ నమోదు, పవన్‌ అభిమాన బలం అంశాలపై లోతైన విశ్లేషణ చేశారు. నంద్యాల నియోజకవర్గంలోని నంద్యాల అర్బన్‌, నంద్యాల రూరల్‌, గోస్పాడు మండలంలో జనసేన సేవాదళ్‌ క్రియాశీలక సభ్యత్వం నాలుగు వేల మంది తీసుకున్నారు. వీరు పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా సైనికుల్లా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

    పవన్ మద్దతిస్తే భూమా ఫ్యామిలీకి సునాయాస గెలుపు

    పవన్ మద్దతిస్తే భూమా ఫ్యామిలీకి సునాయాస గెలుపు

    మరోవైపు, పవన్‌ కళ్యాణ్ బాటన నడిచేందుకు ఆ సామాజికవర్గానికి చెందిన 25 వేల నుంచి 35 వేల మంది అభిమానులు, సేవాదళ్‌ సాధా రణ కార్యకర్తలు, పవన్‌ కల్యాణ్‌ ఆశయ సాధన సమితి సభ్యులు ఉన్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరంతా పవన్‌ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.

    పవన్ అభిమానులను వలలో వేసుకునేందుకు ప్రయత్నాలు

    పవన్ అభిమానులను వలలో వేసుకునేందుకు ప్రయత్నాలు

    ఇప్పటికే పవన్‌ కళ్యాణ్ అభిమానులను తమ వైపు తిప్పుకోవడానికి టిడిపి, వైసిపిలు చర్చలు జరిపారని సమాచారం. ఇదే విషయాన్ని జనసేన సేవాదళ్‌ కార్యకర్తలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి తాము ఎటు వెళ్లాలో దిశానిర్దేశం చేయాలని కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి కీలక పరిస్థితుల్లో పవన్ తీసుకునే నిర్ణయం ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారనుందని అంటున్నారు.

    పవన్ టిడిపికి మద్దతిస్తే మనకు వచ్చే నష్టమేమిటి?

    పవన్ టిడిపికి మద్దతిస్తే మనకు వచ్చే నష్టమేమిటి?

    పరిణామాలను పరిశీలిస్తే ఉప ఎన్నికలో పవన్‌ మద్దతు తమకే ప్రకటిస్తారని టిడిపి ధీమా వ్యక్తం చేస్తోంది. అదే క్రమంలో పవన్‌ తీసుకునే నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని వైసిపి అంచనా వేస్తోంది. పవన్‌ టిడిపికి మద్దతిస్తే ఏఏ సామాజికవర్గాల్లో తమకు నష్టం వాటిల్లుతుందో.. ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలోనని వైసిపి నాయకులు వ్యూహాత్మక ఎత్తులు వేస్తున్నారు.

    పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా మావైపే ఉండండి

    పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా మావైపే ఉండండి

    పవన్‌ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సహకరించాలని ఆయన అభిమానులను వారు కోరినట్లుగా సమాచారం. మిత్రపక్షమైన తమకు జనసేన సేవాదళ్‌ కార్యకర్తలు ప్రచారానికి రావాలని టిడిపి నాయకులు కోరగా.. పవన్‌ తీసుకునే నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని టిడిపికి షాకిచ్చారని తెలుస్తోంది.

    ఇదీ లెక్క

    ఇదీ లెక్క

    నంద్యాల నియోజకవర్గంలో 2,09,612 మంది ఓటర్లు ఉన్నారు. ముస్లింలు, బలిజలు, ఆర్య వైశ్యులు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉన్నారు. బలిజ ఓటర్లు దాదాపు 42 వేలు ఉంటారని అంచనా. దీంతో పవన్‌ తీసుకునే నిర్ణయం బలిజ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశముంది. ఆ సామాజికవర్గం టిడిపికి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టిడిపికి పవన్‌ మద్దతిస్తే బలిజ ఓటర్లు ఆ పార్టీకి మరింత పెరిగే అవకాశముందంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+