నంద్యాలపై ఆ హామీని జగన్ నిలబెట్టుకుంటారా? ఇప్పటికే బాబు పైచేయి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? అనే చర్చ సాగుతోంది.
Recommended Video

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? అనే చర్చ సాగుతోంది.
చదవండి: మీరు లేకుంటే..: శిల్బా బ్రదర్స్‌పై బాబు సెటైర్లు, వైసిపి కొట్లాటలపై ఇలా..

టిడిపికి పోటీగా ఇదీ జగన్ హామీ
వైసిపిలోను, ప్రధానంగా నంద్యాల వైసిపిలో జగన్ ఇచ్చిన హామీ పైన చర్చ సాగుతోందని తెలుస్తోంది. నంద్యాలలో ముస్లీం ఓటర్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో వారి ఓట్లు పొందేందుకు టిడిపి, వైసిపిలు ఎమ్మెల్సీ పదవిని ఎరవేశాయి. అప్పటికే టిడిపి ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వగా, తమకు రాబోయే ఎమ్మెల్సీ సీటును నంద్యాల మైనార్టీలకు ఇస్తామని జగన్ చెప్పారు.

జగన్ హామీని నిలబెట్టుకుంటారా
2018లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ ఎమ్మెల్సీ సీటు వస్తుందని, తానును నంద్యాల ముస్లీం నాయకుడికే ఇస్తామని జగన్ చెప్పారు. ఈ హామీని జగన్ నిలబెట్టుకుంటారా అనే చర్చ సాగుతోంది.

మైనార్టీ ఓట్లు టిడిపికే
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఘోర పరాజయం చవి చూశారు. పైగా, ముస్లీం ఓటర్లు కూడా టిడిపి వైపు మొగ్గు చూపినట్లు వైసిపి నేతలే చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ తన హామీని ఏ మేరకు నిలబెట్టుకుంటారనే గుసగుసలు వైసిపిలోనే కనిపిస్తున్నాయని అంటున్నారు.

నంద్యాల వైసిపి ఏమంటోంది?
పార్టీ గెలిచినా, ఓడినా ఇచ్చిన హామీ మేరకు జగన్ నంద్యాల మైనార్టీకి వచ్చే ఏడాది ఎమ్మెల్సీ సీటును ఇవ్వాలని వైసిపి నేతలు కోరుకుంటున్నారు. తాము గెలిపించకపోయినా.. జగన్ ఇచ్చిన హామీ మేరకు సీటు ఇచ్చారని భావించి, 2019 ఎన్నికల్లో మన వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కాబట్టి జగన్ ఇక్కడి నేతకే సీటు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.

ముందే ఇచ్చి, జగన్‌పై చంద్రబాబు పైచేయి
నంద్యాలలో మైనార్టీ ఓటర్లు టిడిపి వైపు మొగ్గు చూపారు. నంద్యాల మైనార్టీ నేత ఫరూక్‌కు ఇప్పటికే చంద్రబాబు ఎమ్మెల్సీని ఇచ్చారు. తద్వారా జగన్ కంటే ముందే తనకు వచ్చిన అవకాశానని చంద్రబాబు ఉపయోగించుకొని, పైచేయి సాధించారని అంటున్నారు. అంతేకాదు, తాజాగా ఆయనను చైర్మన్ ఆఫ్ కౌన్సిల్‌ని కూడా చేశారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, నంద్యాలకు ఇచ్చిన హామీలపై చంద్రబాబు దృష్టి సారించారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications