కలెక్టరేట్‌లో క్షుద్రపూజల కలకలం: కుర్చీ కింద మంత్రించిన నిమ్మకాయలు
కడప: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో క్షుద్రపూజల అనవాళ్లు కలకలం సృష్టించాయి. పెన్షన్ విభాగంలో ఓ అధికారి కుర్చీ కింద మంత్రించిన నిమ్మకాయలు ఉండటంతో అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వర్గ విభేదాలే ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు.
కాగా, పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉన్న కార్యాలయంలో క్షుద్ర పూజలు ఎలా చేశారనేది తెలియడం లేదు. అయితే కార్యాలయంలోని సిబ్బందే ఈ చర్యకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

మంగళవారం ఉదయం 10గంటలకు అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు కార్యాలయంలోని తన గదిలోకి వెళ్లే సరికి ఆయన కుర్చీ కింద మంత్రించిన నిమ్మకాయ ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. తనంటే గిట్టనివారు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని నాగరాజు తెలిపారు.
గతంలో కూడా తనపై ఇలాంటి చర్యలు జరిగాయని ఆయన చెప్పారు.
10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కడప జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే కోడూరు మండలం వాగేటికోన చెరువు సమీపంలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో సంబంధాలున్నాయని ఏడుగురు విద్యార్థులను కూడా పోలీసులు బైండోవర్ చేశారు.












Click it and Unblock the Notifications