chandrababu letter municipal elections nominations tdp leaders complaint ycp leaders chittoor district inquiry AP Municipal Elections 2021 లేఖ నామినేషన్లు ఫిర్యాదు చిత్తూరు జిల్లా చంద్రబాబు విచారణ
ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ ..చర్యలు తీసుకోవాలని ఎస్ఈసికి చంద్రబాబు లేఖ
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచార హోరు పెంచాయి. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న ఈ ఎన్నికలలో అధికార పార్టీ వైసిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టిడిపి విమర్శిస్తోంది. బెదిరింపులకు పాల్పడుతోందని, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తోందని, ప్రత్యర్థి అభ్యర్థుల నామినేషన్లను విత్ డ్రా చేయడం కోసం ఫోర్జరీ సంతకాలను పెట్టి అక్రమాలకు తెరతీసింది అని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు పెంచిన టీడీపీ ...ప్రచార బరిలోకి చంద్రబాబు

ఫోర్జరీ పత్రాలతో ప్రత్యర్థుల నామినేషన్లను బలవంతంగా ఉపసంహరించారని చంద్రబాబు ఆరోపణ
మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు ఫోర్జరీ పత్రాలతో ప్రత్యర్థుల నామినేషన్లను బలవంతంగా ఉపసంహరించారని ఆరోపించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసిన ఆయన ఓ వర్గం అధికారులు, పోలీసులు, వైసీపీ నాయకులతో కుమ్మకై టిడిపి నేతలతో జరిపే సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణకు పాల్పడ్డారని ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఎస్ఈసికి లేఖలో చర్యలకు చంద్రబాబు డిమాండ్
టీడీపీ అభ్యర్థులుగా నటించిన వైసిపి నాయకులు రిటర్నింగ్ అధికారులకు నకిలీ ఉపసంహరణ పత్రాలను అందజేశారని ఆరోపించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సమయం ముగిసిన తరువాత కూడా నామినేషన్ల ఉపసంహరణ కొనసాగిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అసలు అభ్యర్థులకు తెలియకుండా జరిగిన ఈ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టిసారించాలని, చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

సమగ్ర విచారణ జరపాలన్న చంద్రబాబు .. ఆ తర్వాతే ఏకగ్రీవాలను ప్రకటించాలని విజ్ఞప్తి
అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలన్నారు.
ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల విత్ డ్రా చేసిన వార్డులలో విచారణ జరపాలని, సమగ్ర విచారణ జరిపిన తర్వాతనే ఏకగ్రీవాలను ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ప్రచారానికి మించి, పార్టీ అభ్యర్థులను కాపాడుకోవడం తలకు మించిన భారంగా తయారైంది. బెదిరించి నామినేషన్లు విత్ డ్రా చేయించడం, ప్రలోభాలకు గురి చేయడం, లేదా ఫోర్జరీ సంతకాలతో ప్రత్యర్థి అభ్యర్థుల నామినేషన్ విత్ డ్రా చేయడం వంటి ఘటనలతో టిడిపి ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతల ఫిర్యాదులు .. చంద్రబాబు లేఖపై ఎస్ఈసి స్పందిస్తుందా !!
పలు చోట్ల టీడీపీ నాయకులు ఫిర్యాదులు కూడా చేశారు. ఆళ్ళగడ్డలోనూ నామినేషన్ లను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించుకున్నారని ఫిర్యాదు చేశారు . రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానంగా దీనిపై దృష్టి సారించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు . ఈ మేరకు చంద్రబాబు ఇది రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా లేఖపై ఎన్నికల సంఘం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.