బాత్రూంలో రక్తపు మడుగులో వివాహిత: అసలేం జరిగింది?

జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాధవనగర్‌ రామాలయం వెనుకవీధిలో పల్లవి(33) అనే వివాహిత హత్యకు గురైంది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన రాత్రి సమయంలో వెలుగు.

కర్నూలు: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాధవనగర్‌ రామాలయం వెనుకవీధిలో పల్లవి(33) అనే వివాహిత హత్యకు గురైంది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన రాత్రి సమయంలో వెలుగుచూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రక్తపు మడుగులో..

రక్తపు మడుగులో..

స్థానికులు ఇచ్చిన సమాచారంతో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, త్రీటౌన్‌ సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పల్లవి మృతదేహం ఆమె ఇంట్లోని బాత్‌రూంలో రక్తపు మడుగులో పడివుంది. గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది.

వివాహేతర సంబంధం..

వివాహేతర సంబంధం..

పూజారిగా విధులు నిర్వహిస్తున్న చంద్రమోహన్‌తో ఎనిమిదేళ్ల క్రితం పల్లవికి వివాహమైంది. వీరికి కొడుకు కౌశిక్‌, కూతురు ప్రసన్న ఉన్నారు. పల్లవికి వివాహేతర సంబం ధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగినట్లు సమాచారం.

హత్య చేసి పరారు..

హత్య చేసి పరారు..

ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం భర్త చంద్రమోహన్‌, తన కొడుకు, కూతురు, తల్లితో కలిసి కారులో వెళ్లిపోయారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో అనుమానించిన పొరుగువారు ఇంట్లో వెతికారు. బంధువులు గాలించగా బాత్‌రూంలో పల్లవి మృతదేహం కనిపించింది.

భర్తే నిందితుడు..

భర్తే నిందితుడు..

పల్లవి మృతి విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పల్లవి భర్త చంద్రమోహన్, ఆయన బావ శేఖర్‌(సోదరి భర్త)... పల్లవిని హత్యచేసివుంటారని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కత్తి స్వాధీనం

కత్తి స్వాధీనం

హత్యకు ఉపయోగించిన కత్తిని ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పల్లవి హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+