ఘోరం: గంగానమ్మ దేవతకు గిరిజన మహిళను బలిచ్చారు, 17మంది అరెస్ట్

తూర్పుగోదావరి: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన వై రామవరం మండలం చింతకర్ర పాలెంలో ఓ గిరిజన మహిళను స్థానికులు బలిచ్చారు. ఆమె వల్లే తమ గ్రామానికి అరిష్టం చుట్టుకుందనే మూఢనమ్మకంతో ఈ ఘటనకు పాల్పడ్డట్టు సమాచారం.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చింతకర్ర గ్రామంలో గంగానమ్మ దేవత ఆలయం ఉంది. దానికి ఎదురుగానే కేర చినలక్ష్మీ అనే గిరిజన మహిళ ఇళ్లు ఉంది. ఆమె ఆ గ్రామంలో కూలీ చేసుకొని బతుకుతుంటుంది.

అయితే, ఇటీవలె ఆ గ్రామంలో ఓ సోది చెప్పే మహిళ గ్రామానికి అరిష్టం చుట్టుకుందని, అందువల్లే వర్షాలు రావడం లేదని, పంటలు పండలేదని చెప్పినట్లు తెలిసింది.

 A woman allegedly murdered by Villagers

ఈ నేపథ్యంలో కొంతమంది క్షుద్ర పూజలు చేసేవారితో కూడి స్థానికులు ఆమెను గంగానమ్మ దేవతకు బలివ్వాలని నిర్ణయించారు. అందుకే ఆమెను బలిచ్చే సమయంలో చిత్ర హింసలకు గురిచేసేముందు ఎన్ని అరుపులు అరిచినా కనీసం ఒక్కరు కూడా సహాయం చేసేందుకు రాలేదని తెలుస్తోంది.

ఆమె శరీరంపై కర్పూరం పెట్టి గాయపరిచారని, అనంతరం తలపై చెంబుతో బలంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని చెబుతున్నారు.

కాగా, గత కొద్ది రోజులుగా ఓ పదిమంది వ్యక్తులు ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని వారే లేని పోని నమ్మకాలు అమాయక గిరిజనులకు కల్పించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, 17మంది నిందితులను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+