ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి గురువారం కన్నుమూశారు. ఆమె వయసు 50 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆమె గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
కార్టూనిస్ట్‌గా అటు రాశిలోనూ, ఇటు వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న ఏకైక మహిళ ఆమె. తక్కువ కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కార్టూన్ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబుల సరసన నిలబడే స్థాయి చేరుకున్నారు.

దురదృష్టవశాత్తూ, ఈమెకు చిన్నతంలో వచ్చిన పోలియో కారణంగా శారీరకంగా పటిష్టంగా లేరు. అయినా సరే పలురకాల కార్టూన్లు గీసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. సావిత్రిబాయ్ పూలే మోమోరియల్ ట్రస్ట్ ద్వారా రాగతి కుటుంబ సభ్యులు ఆమె అవయవాల్ని దానం చేశారు.












Click it and Unblock the Notifications