గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న్యాయం చేస్తారా, చావమంటారా: సెల్ టవర్ ఎక్కిన మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: తనకు న్యాయం చేయకపోతే దూకేస్తానంటూ ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి బెదిరింపులకు దిగింది. భర్త మరణించాడు. అయినా అత్తారింటి వేధింపులు ఆగలేదు. ఇంట్లోంచి గెంటేశారు.

దాంతో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లాకు చెదిన లలిత అనే మహిళ సెల్ టవర్ ఎక్కింది. తన సమస్యను పరిష్కరించాలని పోలసులకు ఫిర్యాదు చేసింది.

 సిఎంకు కూడా మొరపెట్టుకుంది

సిఎంకు కూడా మొరపెట్టుకుంది

పోలీసులు స్పందించకపోవడంతో ఇతర అధికారుల వద్దకు వెళ్లింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా కలిసింది. రాష్ట్రపతికి లేఖ రాసింది. అయినా ఫలితం కనిపించకపోవడంతో ఏకంగా సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది.

 పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేక

పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేక

గుంటూరు జిల్లాకు చెందిన లలిత అనే వివాహిత తన భర్తను కోల్పోయింది. భర్త మరణించినప్పటి నుంచి అత్తింటివారి వేధింపులు పెరిగాయి. ఈ విషయంపై గతంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 అత్తింటివారి నుంచి ప్రాణభయం ఉందని

అత్తింటివారి నుంచి ప్రాణభయం ఉందని

తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని వేడుకుంది. కానీ పోలీసులు ఏ మాత్రం స్పందించలేదు. దీంతో ఆమె కలెక్టర్‌ను, ఎస్పీని, ముఖ్యమంత్రిని కలిసింది. రాష్ట్రపతికి లేఖ రాసింది.

 చివరకు ఇలా దిగొచ్చి..

చివరకు ఇలా దిగొచ్చి..

తన విజ్ఞప్తులపై స్పందన లేకపోవడంతో చివరకు గుంటూరులోని డీఇవో కార్యాలయం వద్ద సెల్ టవర్ ఎక్కింది. తనకు న్యాయం చేయకపోతే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో అధికారులు దిగి వచ్చారు. తగిన చర్యలు తీసుకుంటామని వారు ఆమెకు హామీ ఇచ్చారు. దీంతో ఆమె సెల్ టవర్ దిగి వచ్చింది.

English summary
A woman Lalitha climbing cell tower seeling protection from In-laws in Guntur of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X