మహిళపై గ్యాంగ్‌ రేప్, వీడియో చిత్రీకరణ, పంపిణీ

అనంతపురం: మహిళను బెదిరించి ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపి, ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించి మిత్రుల సెల్‌ఫోన్లకు పంపిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కదిరిగుట్టపల్లిలో వారం రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కదిరిగుట్టపల్లి గ్రామానికి చెందిన మహిళ పెళ్లయినప్పటికీ తన ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. దీన్ని పసిగట్టిన గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వారం రోజుల క్రితం ఆమె ప్రియుడితో ఉండడం గమనించి ఇద్దరినీ బెదిరించాడు. దీంతో ప్రియుడు పారిపోగా ఆమెపై వారు ముగ్గురు అత్యాచారం జరిపారు.

Woman gang raped in Ananthapur district

జరిగిన విషయాన్ని ఆమె ఇతరులకు చెప్పకుండా ఉండేందుకై ఆ దృశ్యాలను వారి స్నేహితుడు నరసింహులు వీడియోలలో చిత్రీకరించాడు. వీటిని నరసింహులు తన స్నేహితుల సెల్‌ఫోన్లకు పంపాడు. ఈ వ్యవహారం బయటపడడంతో బాధితురాలు తన భర్త సాయంతో సోమవారం పెద్దవడుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గ్రామానికి చెందిన నాగరాజు, నాగేష్, బాలాంజినేయులతో పాటు మరో ఇద్దరితో పాటు అత్యాచారం దృశ్యాలను వీడియోలో చిత్రీకరించిన నరసింహులుపై పోలీసులకు ఫిర్యాదుచేసింది. నిందితులు పరారీలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+