మిస్టరీ: నడీడు మహిళపై గ్యాంగ్ రేప్, దారుణ హత్య

Woman gang raped and killed in Khammam district
ఖమ్మం: ఖమ్మం-కృష్ణా జిల్లాల సరిహద్దుల్లోని బోనకల్‌, వత్సవాయి గ్రామాల మధ్య ఆర్ అండ్ బి రహదారి పక్కనే ఒక మహిళను గ్యాంగ్‌రేప్‌ చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. బోనకల్‌, వత్సవాయి గ్రామాల మద్య కేవలం 5కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. మంగళవారం రాత్రి 30 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక మహిళను కొంతమంది తీసుకొని వచ్చి గ్యాంగ్‌రేప్‌ చేయడంతో పాటు ఆమెను బండరాయితో మోది హత్య గావించినట్లు తెలుస్తోంది.

వైరా నుండి జగ్గయ్యపేట వెళ్లే ప్రదాన రహదారి పక్కనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో రెండు జిల్లాలకు సంబందించిన పోలీసు బలగాలు అక్కడకు చేరుకొని కేసు విచారణ చేపట్టాయి. సంఘటనా స్థలంలో మూడు బీరు బాటిళ్లతో పాటు కొన్ని నిరోద్‌ పాకెట్లు ఉండటంతో ఎక్కడి నుండో ఒక మహిళను ఇక్కడికి తీసుకొని వచ్చి గ్యాంగ్‌రేప్‌ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఈ మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగ్గయ్యపేట డిఎస్పీ తెలిపారు. సంఘటనా స్థలంలో ఉన్న ఆనవాళ్లను బట్టి పథకం ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో దావానంలా వ్యాపించడంతో పెద్దఎత్తున ప్రజలు అక్కడికి చేరుకోవడం, వింతగా చెప్పుకోవడంతో పోలీసులు కూడా కేసును సీరియస్‌గానే తీసుకున్నారు. ఆగంతకుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

మహిళను ఎక్కడినుండి తీసువచ్చారు.? తీసుకవచ్చినవారు ఎవరు? లాంటి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ స్థలాన్ని బోనకల్‌ ఎసై్స రామకృష్ణారావు పరిశీలించారు. వీరి వెంట జగ్గయ్యపేట సిఐ భాస్కర్‌రావు, చిల్లకల్లు ఎస్సై అబ్దుల్‌ తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+