పాతికేళ్ల యువకుడితో 45 ఏళ్ల మహిళ సంబంధం: అతని చేతిలోనే...
విశాఖపట్నం: పాతికేళ్ల యువకుడితో వైవాహికేతర సంబంధం పెట్టుకున్న 45 ఏళ్ల మహిళ దారుణంగా హత్యకు గురైంది ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో జరిగింది. నిజానికి, మహిళ పది రోజుల క్రితం కనిపించకండా పోయింది.
చివరకు విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం పురుషోత్తపురంలో శవమై తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి ఇంచారర్జీ డిఎస్పీ పివి కృష్ణవర్మ వెల్లడించారు. చింతనిప్పుల ఆగ్రహారానకి చెందిన మహిళ కరణం పార్వతి ఎలియాస్ పిల్లా పార్వతి (45) భర్త కొన్నేళ్ల మృతి చెందారు.
ఆమె కుమారుడు రమేష్ లారీ డ్రైవర్‌గా పని చేస్తుంటారు. పార్వతి ఊరూరా తిరుగుతూ కారం, వడియాలు అమ్ముతుండేది. ఎప్పటి మాదిరిగానే గత నెల 25వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. విధి నిర్వహణలో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన రమేష్ రెండో తేదీన స్వగ్రామానికి వచ్చాడు. తల్లి ఇంటికి రాని విషయం అతనికి తెలిసింది.

బాబీని ప్రశ్నించాడు...
ఎలమంచిలిలోని పురుషోత్తపురం గ్రామంలో ఉంటున్న బాబి వద్దకు వెళ్లి తన తల్లి గురించి రమేష్ ప్రశ్నించాడు. 25వ తేదీన వచ్చి తిరిగి వెళ్లినట్లు అతను చెప్పాడు. అయితే అక్కడ తల్లి చెప్పులు ఉండడాన్ని గమనించిన రమేష్ అనుమానం వచ్చింది. అయితే, ఆ విషయం బయటపడకుండా తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.

మరోసారి ఇలా...
మూడో తేదీన కొంతమంది పార్వతి బంధువులు బాబి ఇంటికి వెళ్లి అడిగారు. అయితే అతని నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు. దీంతో తన తల్లి అదృశ్యమైన విషయాన్ని రమేష్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. బాబిపై అనుమానం ఉందని చెప్పడంతో రూరల్ సీఐ రామచంద్రరావు, ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి పురుషోత్తపురం వెళ్లి మంగళవారం రాత్రే అతనిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం విచారించగా అసలు విషయం బయటపడింది.
Recommended Video


అతనితో వివాహేతర సంబంధం
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం వజ్రకూటం గ్రామానికి చెందిన పిల్లా అబ్బాయి ఎలియాస్ బాబి (25) రెండేళ్ల క్రితం తగరపువలస వద్ద గల దివీస్ ల్యాబ్‌లో పని చేసేవాడు. పార్వతి అక్కడకు కూడా కారం అమ్మేందుకు వెళ్లింది. దాంతో ఆమెతో బాబీకి పరిచయమై అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. బాబి అక్కడ ఉద్యోగం మానేసి నక్కపల్లి హెట్రో కంపెనీలో చేరాడు. రెండేళ్లుగా హెట్రోలో హమాలీగా పని చేస్తూ పురుషోత్తపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి ఇరువురి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూ వచ్చింది.

అతని ఇంటికే వెళ్లింది...
గతనెల 25వ తేదీన పార్వతి బాబి ఇంటికి వెళ్లింది. రాత్రి సమయంలో ఇద్దరూ కలిసే ఉన్నారు. ఆ సమయంలో పార్వతి ఫోన్‌లో ఎవరితోను మాట్లాడడాన్ని బాబి గమనించాడు. ఆమెను అందుకు మందలించాడు. తానుండగా వేరేవారితో మాట్లాడటం ఏమిటంటూ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆవేశంతో బాబి ఇంట్లో ఉన్న కర్రతో ఆమె తలపై బలంగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

రోజంతా ఇంట్లోనే ఉంచాడు...
పార్వతి మెడలోని రెండుపేటల పుస్తులతాడు, చెవిదిద్దులు, వెండి పట్టీలు తీసేసి శవాన్ని బాబీ ఆ రోజంతా ఇంటిలోనే ఉంచాడు. 26వ తేదీ రాత్రి తన సోదరుడు అప్పారావు సహాయంతో ఇంటికి ఒక అర కిలోమీటరు దూరంలో ఉన్న రైల్వేట్రాక్ కల్వర్టు కింద మృతదేహాన్ని పడేశారు. 27వ తేదీన ఒక బ్యాంక్‌లో ఆమె వద్ద నుంచి తీసిన బంగారాన్ని 56 వేల రూపాయలకు బాబీ తాకట్టు పెట్టేశాడు.

పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో...
బాబికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో పార్వతి అడ్డు తగులుతుందనే భయంతో ఆమెను హత్య చేసినట్లు భావిస్తున్నారు పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన బాబీ శవాన్ని పడేసిన చోటును చూపించాడు. పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.నిందితుడు హత్య చేయడానికి వాడిన చెక్క కర్రను, వారు సేవించిన మద్యం సీసాలను, పార్వతి నగలకు సంబంధించిన రశీదులను, స్వాధీనం చేసుకున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications