భార్య కోర్కె తీర్చలేదని మెడకు చీరను చుట్టి చంపేశాడు
హైదరాబాద్: కోర్కె తీర్చలేదనే కారణంతో కట్టుకున్న భార్యను చంపేశాడో భర్త. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండల గ్రామ పరిధిలోని గార పేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గారపేట గ్రామానికి చెందిన రాములు ఇంటి గడపలో నిద్ర మత్తులో ఉన్న భార్య మెడకు గట్టిగా చీరను చుట్టేసి లాక్కొని ఇంట్లోకి తీసుకెళ్లిపోయి చంపేశాడని పోలీసులు తెలిపారు. ఆమె విడిపించుకోకుండా ఉండేందుకు గాను చేతులు, కాళ్లు గట్టిగా కట్టేశాడు.

కొన ఊపిరితో ఉన్నప్పుడు ఫ్యాన్‌కు ఉరేయడంతో ఆమె మరణించింది. ఇదంతా కేవలం తాను తాగిన మైకంలోనే ఉన్నప్పుడు చేశానని చెప్పాడు. భార్యను చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఆమె అరవలేదా అంటే అరిచిందనే చెప్పాడు.
ఆమె అరుస్తున్నప్పటికీ శబ్దం బయటకు రాకుండా గట్టిగా చీరను ఆమె గొంతుకు బిగించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడిపై గతంలో కూడా భార్య తల బద్దలు కొట్టిన ఘటనలో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
రైలు నుంచి జారిపడి మహిళ మృతి
రైలు దిగుతూ ప్రమాదవశాత్తూ జారి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన విజయవాడ రైల్వే స్టేషన్‌లో సోమావరం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన లక్ష్మికాంతం(42) రైలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications