వివాహితపై రేప్ ఆపై హత్య, కత్తితో పొడిచిన ప్రియుడు

విజయవాడ: నగరంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. దుండగులు వివాహితను హత్య చేసి సిద్థార్థ మెడికల్‌ కాలేజి గ్రౌండ్స్‌లో పడేశారు. వివాహితపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వివాహితను ఆయేషా ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నెల్లూరులో వివాహితను కత్తితో పొడిచి చంపిన ప్రియుడు

వివాహితను ప్రియుడే కత్తితో పొడిచి చంపిన ఘటన నెల్లూరు జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. జిల్లాలోని వేణుగోపాలపురంలో నాగలక్ష్మీ అనే వివాహిత భర్త దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. భర్త విదేశాల్లో ఉండటంతో నాగలక్ష్మీ, ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

woman killed in vijayawada

వీరిద్దరి మధ్య ఏదో విషయంలో మనస్పర్ధలు రావడంతో ప్రియుడే ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన వేణుగోపాలపురంలో కలకలం సృష్టించింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, కేసు దర్యాప్తు ప్రారంభించారు.

బావిలోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం, ప్రియురాలి మృతి

కృష్ణాజిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కీలేశ్వరపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో ప్రియురాలి మృతి చెందగా, ప్రియుడిని స్ధానికులు కాపాడారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ప్రియురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+