వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 రోజుల క్రితం మహిళ హత్య: చంపేసి, చేతులు కట్టేసి, గోతంలో కుక్కి.

ఓ మహిళను హత్య చేసి దాన్ని కప్పిపుచ్చడానికి నిందితులు చేసిన ప్రయత్నాలు వెలుగులోకి వచ్చింది. ఇరవై రోజుల క్రితం హత్య చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. మహళను హత్య చేసి చేతులను తాళ్లతో కట్టేసి,

By Pratap
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ఓ మహిళను హత్య చేసి దాన్ని కప్పిపుచ్చడానికి నిందితులు చేసిన ప్రయత్నాలు వెలుగులోకి వచ్చింది. ఇరవై రోజుల క్రితం హత్య చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. మహళను హత్య చేసి చేతులను తాళ్లతో కట్టేసి, శవాన్ని గోతంలో కుక్కారు.

దాన్ని ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని చక్రాయపాలెం సమీపంలో భవనాసి చెరువుపై ఉన్న వంతెన దిగువ భాగాన పడేశారు. దాదాపు 20 రోజుల క్రితం ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు.

శవం గుర్తు పట్టరాని స్థితిలో ఉంది. పూర్తిగా కుళ్లిపోయింది. వాహనంలో తీసుకుని వచ్చి శవాన్ని అక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు.

ఇలా బయటపడింది...

ఇలా బయటపడింది...

బ్రిడ్జి కింద భాగాన రాత్రి వేళల్లో గొర్రెల మందలను నిలుపుకోవడానికి కంచె వేసుకునేందుకుగొర్రెల కాపరులు సోమవారం ఉదయంఅక్కడికి వెళ్లారు. అక్కడ వారికి దుర్వాసన వచ్చింది. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. సిఐ హైమారావు, ఎస్సై సుబ్బరాజులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Recommended Video

PV Sindhu appointed as Group-I officer in AP
తొలుత ఇలా భావించారు...

తొలుత ఇలా భావించారు...

గోతంలో కట్టివేసి ఉన్న శవం జంతు కళేబరం అయి ఉండవచ్చని మొదట భావించారు. గోతాన్ని కోసి చూడగా మహిళ మృతదేహమని తేలింది. చీర,గాజులు మా త్రమే గుర్తు పట్టే విధంగా ఉన్నాయి. మిగిలిన అవయవాలు కుళ్ళి పోయి ఉన్నాయి. మృతదేహాన్ని గోతంలో కట్టి పడవేసి ఉండటంతో అస్థిపంజరం కూడా వంగి పోయి ఉంది. రెండు చేతులు కట్టి పడేసి ఉన్నాయి.

ఇలా తెచ్చి ఉంటారు...

ఇలా తెచ్చి ఉంటారు...

మహిళను హత్య చేసి గోతంలో వేసుకొని వాహనంలో తీసుకు వచ్చి పడవేసి ఉండవచ్చని దాన్ని బట్టి భావిస్తున్నారు. భవనాసి చెరువుపై నామ్‌ రోడ్డు కోసం రెండు బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. ఆ రెండు బ్రిడ్జిల మధ్యలో మృతదేహంతో ఉన్న మూటను పడవేసి ఉంటారని భావిస్తున్నారు. మృతురాలి వయస్సు కూడా గుర్తు పట్టే వీలు లేకుండా ఉంది.

ఇలా పరిశీలించారు...

ఇలా పరిశీలించారు...

మహిళ అస్తిపంజరాన్ని దర్శి డీఎస్పీ విఎస్‌ రాంబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. అదృశ్యమైన మహిళల జాబితాను ఇతర పోలీసు స్టేషన్ల నుంచి తీసుకొని పరిశీలించి వారి బంధువులకు సమాచారం అందజేస్తామని డీఎస్పీ తెలిపారు.

English summary
A woman in Prakasam disrict of Andhra Pradesh has been killed and dumped the dead body under the bridge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X